జయలలిత మరణంతో తమిళనాట విషాదం!

Tamil Nadu Chief Minister Jayalalitha expired on December 5th 11:30 pm

11:26 AM ON 6th December, 2016 By Mirchi Vilas

Tamil Nadu Chief Minister Jayalalitha expired on December 5th 11:30 pm

తమిళ రాజకీయాల్లో తిరుగులేని జననేత జయలలిత ఇక లేరన్న వార్తను తమిళనాట ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 75రోజులుగా ప్రజలు చేస్తున్న ప్రార్థనలు ఫలించలేదు. మొత్తం తమిళనాడు రాష్ట్రమే మూగబోయింది. అమ్మా, అమ్మా అంటూ తల్లడిల్లిపోతున్నారు. కోట్లాది పేదల ఆకలి తీర్చిన అమ్మ వెళ్లిపోతే తమకు దిక్కెవరు అని గొంతెత్తి ఏడుస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత(68) సోమవారం రాత్రి 11.30 గంటలకు కన్ను మూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించడంతో సర్వత్రా విషాదం అలుముకుంది. ద్రవిడ, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జయ కన్నుమూతతో యావత్ దేశం శోకసంద్రమైంది.

తమిళ ప్రజల గుండెలు ఆవేదనతో అల్లాడుతున్నాయి. అమ్మగా అండగా వుంటూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి కంట నీరును తుడిచిన ఆ అమృతహస్తాలు ఇక లేవన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు నెలలకు పైగా తమిళప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. కొన్నాళ్ల క్రితం కోలుకున్న ఆమెకు తాజాగా గుండె నొప్పి రావడంతో ఢిల్లీనుంచి వచ్చిన ప్రత్యేక వైద్యబృందాలు చికిత్స అందించాయి. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.

1/11 Pages

ఇక రెండునెలలకు పైగా ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రికి పరిమితమయ్యారు. ఒకసారి గత రెండు నెలల పరిణామాలను పరిశీలిస్తే, సెప్టెంబర్ 22న జ్వరం, డీహ్రైడ్రేషన్ సమస్యలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు.

English summary

Tamil Nadu Chief Minister Jayalalitha expired on December 5th 11:30 pm