పెళ్ళికి శతృవుని పిలిచాడని అమ్మ వేటు వేసేసింది!

Tamil Nadu CM Jayalaitha suspended Vaikunta Rajan

01:25 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Tamil Nadu CM Jayalaitha suspended Vaikunta Rajan

దేశంలో రాజకీయాలు వేరు. తమిళనాట జరిగే రాజకీయాలు వేరు. హిట్లర్ తరహా రాజకీయాలు అక్కడ రాజ్యమేలుతుంటాయి. అధినేతలకు కోపం వస్తే, ఎంత పెద్ద నాయకుడికైనా శిక్ష పడిపోతుంది. అందునా ఏఐడిఎంకె అధినేత్రి, పురుచ్చి తలైవి అని పిలిచే సీఎం జయలలితకు కోపం వస్తే ఇక అంతేసంగతులు. ఎవరైనా సరే బలై పోవాల్సిందే. కారణం ఏదైనా సరే, వేటు పడాల్సిందే. అయితే ఇంట్లో పెళ్ళికి శతృవుని పిలిచినందుకు ఓ సీనియర్ నేతపై జయలలిత వేటు వేసింది. వివరాల్లోకి వెళ్తే.. తిరునల్వేలి జిల్లాలో బలమైన నేత నారాయణ, ఏఐఏడీఎంకే నిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన తన కొడుకుకు ఇటీవలే పెళ్ళి చేశారు.

చాలా అట్టహాసంగా ఈ మేరేజ్ చేసాడు. గొప్పగొప్పవాళ్ళంతా వచ్చి వధూవరులను దీవించారు. అలా వచ్చినవారిలో పారిశ్రామికవేత్త వైకుంఠ రాజన్ కూడా ఉన్నారు. అదిగో అక్కడే వచ్చింది అసలు చిక్కంతా. నారాయణుడి పదవికి ఎసరు పెట్టడానికి ఈ వైకుంఠమే కారణమయ్యాడు.. వైకుంఠంపై అమ్మ ఆగ్రహానికి ఓ కథ ఉంది లెండి. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ పుష్ప తిరుగుబాటు చేసిన సమయంలో, ఆమెతో కొంతమంది సత్సంబంధాలు వున్నాయి. అయితే ఆలాంటి వారికి చెక్ చెప్పాలని జయలలిత గట్టి పట్టుదలగా ఉన్నారు. అందుకే పార్టీ నేతలపై మాత్రమే కాకుండా పారిశ్రామికవేత్తలపై కూడా ఆమె దృష్టి పెట్టారు. ఆ వర్గంలో చేరిన పారిశ్రామికవేత్తల్లో తూత్తుకుడికి చెందిన వైకుంఠ రాజన్ కూడా ఉన్నారు. తూత్తుకుడి, తిరునల్వేలి పక్క పక్క జిల్లాలే కావడం విశేషం.

పాపం ఈ విషయం తెలుసో తెలియదో కానీ, వైకుంఠ రాజన్ ను పెళ్ళికి పిలిచినందుకు నారాయణపై అమ్మ కు పట్టారని కోపం వచ్చేసింది. ఆగ్రహంతో రగిలిపోయారు. వెంటనే నిర్వాహక కార్యదర్శి పదవి నుంచి నారాయణను పీకిపారేసారు. అయితే పార్టీ సభ్యత్వం మాత్రం అలానే ఉంచడం ద్వారా కరుణించారు. ఇక అసలు విషయం ఏమిటంటే వైకుంఠ రాజన్ ఈ పెళ్ళికి వస్తున్నారని సమాచారం అందడంతో ఏఐఏడీఎంకే వర్గాలు అసలు ఆ పెళ్లి దరిదాపులకే వెళ్లలేదట. మరి అమ్మా మజాకా!

English summary

Tamil Nadu CM Jayalaitha suspended Vaikunta Rajan