'డిక్టేటర్‌' రీమేక్‌లో తమిళ హీరో!

Tamil Star Hero in Dictator tamil remake

10:35 AM ON 7th January, 2016 By Mirchi Vilas

Tamil Star Hero in Dictator tamil remake

నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్‌ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడా విడుదలవబోతుందని కొద్ది రోజులుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు తమిళ వెర్షన్‌కు సంబంధించి మరో విషయం బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చెయ్యాలని ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్ధ భావిస్తుందట. అందుకే తమిళంలో స్టార్‌ హీరో అయిన అజిత్ను సంప్రదించారట. ఈ కథని అజిత్‌కు వినిపిస్తే పాజిటీవ్‌ గానే రెస్పాండ్‌ అయ్యారట. అయితే డిక్టేటర్‌ విడుదలయ్యాక హిట్‌ టాక్‌ వస్తే నటిస్తానని అజిత్‌ చెప్పారట. డిక్టేటర్‌ హిందీ వెర్షన్‌లో ఇప్పటికే అజయ్‌ దేవగన్‌ని ఎంపిక చేసుకోగా తాజాగా తమిళ వెర్షన్‌కి అజిత్‌ని సంప్రదించారు.

English summary

Tamil Star Hero Ajith in Dictator tamil remake