జల్లికట్టు పోరులో హేమాహేమీలు - సక్సెస్ వెనుక కీలక పాత్ర

Tamilians succeded with Jallikattu issue

11:11 AM ON 21st January, 2017 By Mirchi Vilas

Tamilians succeded with Jallikattu issue
తమిళ సంప్రదాయంలో భాగంగా గల జల్లికట్టుపై నిషేధం విధించడం తగదంటూ తమిళ తంబీలు చేపట్టిన ఆందోళనకు కేంద్రం దిగొచ్చింది. కోర్టులో వున్న ఈ వివాదంపై చాలా కధే నడిచింది. తమిళ తంబీలు చేపట్టిన దీక్షలు , నిరసనల కార్యక్రమం చేపట్టిన తమిళ యువతకు సంఘీభావంగా టీనగర్ లోని దక్షిణ భారత సినీ కళాకారుల అసోసియేష్ ప్రధాన కార్యాలయం ముందు జరిగిన మౌన నిరసనలో రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, సూర్య, ధనుష్ పలువురు నటులు పాల్గొన్నారు. దీనికి నడిగర సంఘం అధ్యక్షుడు నాజర్ సారథ్యం వహించగా, సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షుడు పొన్ వణ్ణన్ తదితరులు హాజరయ్యారు. తమిళనాట థియేటర్లు మూతపడగా, టెక్నీషియన్లు, దర్శకుడు, నిర్మాతల అసోసియేషన్ తో సహా తమిళ చలనచిత్ర యూనియన్లనీ తమ మద్దతు ప్రకటించాయి. నడిగర సంఘం ఆధ్వర్వంలో జరిగిన మౌన నిరసన కార్యక్రమంలో శివకుమార్, కె.భాగ్యరాజ్, సత్యారాజ్, పి.పార్దీబన్, ప్రభు, మన్సూర్ అలి ఖాన్, శివకార్తికేయన్, సంతానం, రమేష్ ఖన్నా, అన్నాడీఎంకే మాజీ సభ్యుడు ఆనందరాజ్, మనోబాల, వై.జీ.మహేంద్రన్, రెహ్మాన్, త్రిష, శాలిని, కోవైసరళ, పూచి పురగన్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి పోరాటం ఫలించింది. జల్లికట్టుపై నిషేధం తొలగింది.

ఇది కూడా చూడండి : పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

ఇది కూడా చూడండి : హిట్లర్ ఆత్మహత్య చేసుకోలేదట - అది నాటకమేనట

English summary

Tamilians succeed with Jallikatu Issue. The government which refused this tradition recently taken back its words.