మార్షల్స్ ట్రీట్ మెంట్ తో చెక్

Tamilnadu Assembly Speaker Suspends All DMK MLAs

10:24 AM ON 18th August, 2016 By Mirchi Vilas

Tamilnadu Assembly Speaker Suspends All DMK MLAs

స్టాలిన్ దూకుడుకి తమిళనాడు సీఎం జయలలిత చెక్ పెట్టారు. ప్రతిపక్ష నేత స్టాలిన్ ను తమిళనాడు అసెంబ్లీ నుంచి మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సభలో కార్యకలాపాలను అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో మొత్తం డీఎంకే సభ్యులందరినీ వారంరోజుల పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.

బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం జయలలిత 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను గుర్తుకు తెచ్చేలా రూలింగ్ చేస్తున్నారని, అంతేకాదు డిక్టేటర్ లా వ్యవహరిస్తున్నారని డీఎంకే ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ, అసెంబ్లీలో ఆందోళన చేపట్టారు.పాలకపక్ష సభ్యులు ఎంత చెప్పినప్పటికీ వినకపోవడంతో డీఎంకేకి చెందిన 89 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలనందరినీ బయటకు పంపేశారు. ఐతే, స్టాలిన్ మొండికేయడంతో మార్షల్స్ ఎత్తుకుని బయటకు తీసుకెళ్లారు. దీనిపై మాట్లాడిన స్టాలిన్, ప్రభుత్వం తనను అవమానించిందని, ఏ మాత్రం మర్యాదలేకుండా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ గొడవ ఎటు దారితీస్తుందో చూడాలి.

English summary

Tamilnadu Assembly Speaker Suspends All DMK party MLA's from Tamilnadu assembly for a week and Bouncers took Stalin away from the Tamilnadu Assembly force fully. DMK fired on Tamilnadu Government for doing these type of things.