ఇంతకీ ఆ ఆడియోలో ఏముంది? నిజంగా అమ్మ మాట్లాడిందా?(వీడియో)

TamilNadu CM Jayalalitha's audio record going viral

10:58 AM ON 5th October, 2016 By Mirchi Vilas

TamilNadu CM Jayalalitha's audio record going viral

గత 14రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న జయలలిత మాట్లాడారంటూ ఓ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జయలలిత ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో అమ్మకోసం పలువురు ఆందోళన చెందుతున్నారు. రకరాకాల పూజలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఈలోగా అమ్మ మాట్లాడినట్లు జయ కోలుకుంటున్నారని చెప్పడానికి ఈ ఆడియో సాక్ష్యమని అన్నాడీఎంకె అభిమానులు అంటున్నారు. అసలు ఆ ఆడియోలో మాటలిలా ఉన్నాయి.

'నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న.. ప్రతి రోజూ నేను కోలుకోవాలని కోరుతున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.. దేవుడి దయవల్ల నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తగినంత విశ్రాంతి తీసుకున్నాక నేను మీ అందరి ముందుకు వచ్చి స్వయంగా కృతఙ్ఞతలు చెబుతా.. నా అనారోగ్యానికి కారణం ఏమిటో కూడా వివరిస్తా.. నా ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను నమ్మకండి అని ఆ ఆడియోలో వుంది'. ఇంకా ఇలా వుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకె ఘన విజయాన్ని, పార్టీ అందిస్తున్న శాంతియుత పాలనను జీర్ణించుకోలేని ప్రతిపక్షం నా ఆరోగ్యం గురించి లేనిపోని వదంతులు వ్యాపింపజేయడానికి ప్రయత్నించింది.

అయితే కోట్లాది మద్దతుదారుల ఆశీస్సులు, ఎంజీఆర్ సోదర, సోదరీమణుల ప్రేమాభిమానాలు ఉన్నంతకాలం నన్ను మీ నుంచి ఎవరూ వేరు చేయలేరు.. నేను మీ వల్లే.. మీ అందరి కోసమే ఉన్నా.. అందువల్ల ఇదివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకెను ఆదరించినట్టుగానే.. ఈ నెలలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో రెండాకుల గుర్తుపై ఓట్లు వేసి పార్టీకి ఘన విజయం అందించాలని కోరుతున్నా.. జై అన్నా.. జై ఎంజీఆర్ అని ఆ ఆడియోలో వుంది. ఇంతకీ ఈ ఆడియో అమ్మదేనా, కాదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

English summary

TamilNadu CM Jayalalitha's audio record going viral