అమ్మ మరణం వెనుక కుట్ర ?.... మరి చెంపపై ఆ గుర్తులేంటి..?

Tamilnadu Ex Chief Minister Jayalalitha Death Mystery

10:48 AM ON 9th December, 2016 By Mirchi Vilas

Tamilnadu Ex Chief Minister Jayalalitha Death Mystery

తమిళనాట అందరిచేతా అమ్మగా కొలవబడి, అనంత లోకాలకు వెళ్లిన అమ్మకు అశేష జనవాహిని కడపటి కన్నీటి వీడ్కోలు పలికిన సంగతి తెల్సిందే. అయితే ముందునుంచీ అమ్మ ఆరోగ్యం గురించి, ఆతర్వాత మరణం గురించి రకరకాల కధనాలు వినిపిస్తూనే వున్నాయి. అయితే ఇప్పుడు మరో వార్త ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. జయలలిత మరణించిందంటూ….అధికార ప్రకటన డిసెంబర్ 5 రాత్రి 11.30 నిమిషాలకు వచ్చినప్పటికీ…జయలలిత చాలా సేపటి క్రితమే/చాలా రోజుల క్రితమే చనిపోయారని, డాక్టర్లు కావాలనే ఈ విషయాన్ని దాచారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణలకు జయలలిత చెంప మీదున్న నాలుగు రంధ్రాలు బలం చేకూరుస్తున్నాయి. వైద్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఎవరైనా మరణిస్తే ఆ శరీరం గంటల తరబడి పాడు కాకుండా ఉండేందుకు రసాయన మందులు వాడుతారని.. ఇంజక్షన్ ల రూపంలో ఆ మందును శరీరంలోకి పంపిస్తారని చెపుతున్నారు. దీనిని ఎమాల్మింగ్ అంటారని.. జయలలిత విషయంలో కూడా ఇదే జరిగిఉండొచ్చని డాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు . అయితే ఈ టీకా ఎప్పుడు వేసిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అమ్మ ఒక్క రోజు ముందుగానే తుది శ్వాస విడిచారనిపిస్తుంది!

అయితే ఈ మరణ ధృవీకరణ వెనుక కూడా రహస్యం దాగుందని.. జయలలిత స్నేహితురాలు శశికళ నిర్ణయంతో ఇలా జరిగి ఉండవచ్చని.. తమిళనాడు సీఎం పీఠం, పార్టీ అధ్యక్ష పదవులపై నెలకొన్న సమస్యల వల్లే అమ్మ మరణాన్ని ధృవీకరించడాన్ని పోస్ట్ ఫోన్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శాంతిభద్రతలు సమస్య కూడా మరో కారణం కావొచ్చు అంటున్నారు విశ్లేషకులు.

అయితే….జయలలిత తమ్ముడి కూతురు…జయ స్నేహితురాలు శశికళ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. భయంకరమైన నిజాలు భయటపెడతానని మీడియా ముఖంగా అన్నారు. ఆమె ఆరోపణలకు, జయలలిత చెంప మీదున్న రంద్రాలు…ఎంత మేరకు ఆధారాలుగా నిలుస్తాయో చూడాలి. మొత్తానికి అమ్మ మరణం వెనుక కుట్ర ఉందా లేక కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారా అనేది తేలనుంది.

ఇవి కూడా చదవండి: బాహుబలి సృష్టికర్త రాజమౌళికి చంద్రన్న పిలుపు!

ఇవి కూడా చదవండి: ఇంతకీ అమ్మ వదిలి వెళ్లిన ఆస్తులెంతో తెలుసా ? మరి వాటికి వారసులెవరంటే,

English summary

Tamilnadu Ex-Chief Minister Amma Jayalalitha was died few days before and a question raised that there were some holes on her face and some were questioning that what were that holes on her face. Saying that Jayalalitha was died before doctors made statement.