కృష్ణవంశీ విలన్ ని చూస్తే షాకవ్వాల్సిందే!

Tanish in Nakshatram movie

11:14 AM ON 26th October, 2016 By Mirchi Vilas

Tanish in Nakshatram movie

టాలీవుడ్ లో సృజనాత్మక డైరెక్టర్లలో మొట్టమొదటి స్థానంలో కృష్ణవంశీని చెప్పుకోవచ్చు. అందుకే అతడిని క్రియేటివ్ డైరెక్టర్ అంటుంటారు.. ప్రస్తుతం ఆ క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో రాబోతున్న తాజా మూవీ 'నక్షత్రం'. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్ లు విడుదల చేయడంలోనూ కృష్ణవంశీ తన మార్క్ క్రియేటివిటీని ఉపయోగిస్తున్నాడు. అయితే తాజాగా తన విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు కృష్ణవంశీ. ఆ విలన్ ఎవరో తెలిస్తే కొంత ఆశ్చర్యం కలగక మానదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమై.. ఆ తర్వాత హీరోగా తన లక్కును పరీక్షించుకొని విఫలమయ్యాడు అతడు. తనీష్. నచ్చావులే, రైడ్ వంటి చిత్రాలతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన తనీష్.. తాజాగా సినిమాలో విలన్ అవతారం ఎత్తాడు.

కళ్లకు లెన్సులు పెట్టుకుని నిజంగా విలనిజాన్ని ఫస్ట్ లుక్ లోనే పండించేశాడు తనీష్. మరి హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయిన తనీష్.. విలన్ గానైనా ఆకట్టుకుంటాడా? పోస్టర్ లో ఉన్నంత దీటుధనాన్ని సినిమాలో చూపిస్తాడా? అన్నది సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. సందీప్ కిషన్, రెజీనా హీరో..హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ లు ప్రత్యేక అతిథి పాత్రలు పోషిస్తున్న నేపథ్యంలో ఈ మూవీ ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

English summary

Tanish in Nakshatram movie