చిక్కుల్లో పడిన మరో కమీడియన్

Tanmay Bhatt blasted in twitter for morphing Sachin

04:16 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Tanmay Bhatt blasted in twitter for morphing Sachin

ఆ మధ్య ఓ కమీడియన్ వివాదాస్పదం కాగా, ఇప్పుడు మరో కమీడియన్ చిక్కుల్లో పడ్డాడు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను అపహాస్యం చేస్తున్నట్టు ఎఐబీ కమీడియన్ తన్మయ్ భట్ రూపొందించిన వీడియో ఇందుకు కారణం. సచిన్ వెర్సెస్ లతా సివిల్ వార్ అనే టైటిల్ తో ఈ నెల 26న భట్ ఫేస్ బుక్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఫేస్-స్వాప్ యాప్ తో వీరి ముఖాలను అటూ ఇటూ మార్చి వితండ ప్రయోగం చేశాడు. పైగా సచిన్, లతా మంగేష్కర్ లేనిపోని సంభాషణలు చేస్తున్నట్టు దీన్ని రూపొందించాడు. ఇతని ఈ యవ్వారం పై రాజ్ థాక్రే నేతృత్వంలోని నవనిర్మాణ్ సేన మండి పడింది.

భట్ కు దేహశుద్ది చేస్తామని హెచ్చరించింది. అతని పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా నిర్ణయించింది. భట్ అప్ లోడ్ చేసిన వీడియోను వెంటనే తొలగించాలని సేన ఛత్రపత్ అధ్యక్షుడు అమేయ ఖోష్కర్ డిమాండ్ చేశారు. అటు-బాలీవుడ్ కూడా భట్ ని దుయ్యబట్టింది. అనుపమ్ ఖేర్, రితేష్ దేశ్ ముఖ్ వంటివారు.. భట్ క్షమాపణ చెప్పాలని తమ ట్విటర్స్ లో డిమాండ్ పెట్టారు. మొత్తానికి ఈ కమీడియన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

English summary

Tanmay Bhatt blasted in twitter for morphing Sachin