మరో డర్టీ పిక్చర్ లో తాప్సీ!

Tapsee in adult content movie

10:55 AM ON 1st August, 2016 By Mirchi Vilas

Tapsee in adult content movie

ఎక్కడైనా కాంపిటేషన్ అన్నది కామన్. అందునా గ్లామర్ బిజినెస్ తో కూడిన సినిమా అంటే ఇక చెప్పక్కర్లేదు. అందుకే అవకాశాల కోసం స్క్రీన్ మీద హీరోయిన్లు గ్లామర్ ఒలకబోస్తుంటారు. హీరోయిన్లను తనకంటే ఎవరూ గ్లామర్ గా చూపించలేరని పేరున్న రాఘవేంద్రరావు టచ్ చేస్తే, ఫీల్డ్ లోకి వచ్చిన తాప్సీ తన మొదటి సినిమా 'ఝమ్మంది నాదం'లో వీలైనంత గ్లామర్ గుప్పించింది. తరువాత ప్రభాస్, గోపీచంద్, వెంకటేష్ సినిమాలు చేసినా తాప్సీకి అనుకున్నంత అవకాశాలు దక్కలేదు. ఇక లాభం లేదనుకున్న ఈ భామ అవకాశాల వేటలో బాలీవుడ్ చేరింది. తాప్సీకి సిద్ధార్థ్ తో కలసి 'చష్మే బద్దూర్' మూవీలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆ సినిమాలో కూడా వీలైనంత గ్లామర్ కుమ్మరించినా ఫలితం దక్కలేదు.

తాప్సీకి ఊహించిన రేంజ్ లో అవకాశాలు రాకపోయినా, తరువాత అక్షయ్ కుమార్ తో 'బేబీ'లో ఓ పాత్ర చేసింది అంతే. అలా డల్ కెరీర్ లో వున్న తాప్సీకి ఏక్తా కపూర్ నుంచి ఊహించని ఆఫర్ వచ్చింది. డర్టీ పిక్చర్ తో బాలీవుడ్ లో విద్యాబాలన్ డిమాండ్ ని అమాంతంగా ఏక్తా కపూర్ పెంచేసింది. ఇప్పుడు తాప్సీకి కూడా ఓ అడల్ట్ కంటెంట్ మూవీలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చింది. మామూలు మూవీల్లోనే ఓ రేంజ్ లో గ్లామర్ డోస్ ఇచ్చే తాప్సీ, ఈ అడల్ట్ కంటెంట్ మూవీలో వీర లెవెల్లో రెచ్చిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి రూటు మార్చిన తాప్సికి ఇప్పటికైనా సరైన దారి దొరుకుతుందో లేదో చూడాలి.

English summary

Tapsee in adult content movie