హెయిర్‌ ఆయిల్‌ యాడ్‌లో కోలీవుడ్‌ బ్యూటీ!

Tapsee in Hair oil advertisement

11:28 AM ON 9th December, 2015 By Mirchi Vilas

Tapsee in Hair oil advertisement

ఝమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార తాప్సీ ఆ తరువాత వెంకటేష్‌, ప్రభాస్‌, రవితేజ, మంచు విష్ణు, ఆది పినిశెట్టి వంటి హీరోలతో నటించింది. ఇందులో ప్రభాస్‌తో చేసిన మిర్. పర్ఫెక్ట్ చిత్రం తప్ప మిగతావన్ని అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తరువాత బాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. బాలీవుడ్‌లో ఛష్మేబద్దూర్‌ అనే చిత్రంలో నటించింది. అది యావరేజ్‌గా ఆడడంతో తమిళంలో కూడా అవకాశం వచ్చింది. లారెన్స్‌ దర్శకత్వంలో వహించిన 'గంగా' (కాంచన-2 తమిళం)లో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు తాప్సీ తన నటనతోనూ ప్రేక్షకులని కట్టిపడేసింది.

ఈ చిత్రంతో తాప్సీ అమాంతం క్రేజ్‌ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ క్రేజ్‌తోనే ఒక యాడ్‌లో కూడా నటించింది. 28 వయస్సు గల ఈ ఢిల్లీ భామ 'నిర్మల్‌ కొబ్బరినూనె'ని ప్రమోట్‌ చెయ్యడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆయిల్‌ని ప్రమోట్‌ చెయ్యడానికి గల ముఖ్యకారణం తాప్సీ తల్లి పేరు కూడా నిర్మల్‌జీత్‌ పన్ను. తన తల్లి పేరుతో ఉన్న కొబ్బరినూనెని ప్రమోట్‌ చెయ్యడం ఎంతో ఆనందాంగా ఉందని చెప్తుంది. అంతే కాదు యాడ్‌కి తనని తీసుకున్నందుకు పెద్దగా ఆశ్చర్యమేమీ అనిపించలేదట. ఎందుకంటే తాప్సీ తన కాలేజ్‌ టైమ్‌ లో ఉన్నప్పుటి నుండి తన రింగులు తిరిగిన జుట్టుని చూసి తన స్నేహితులు చాలా అందంగా ఉందని మెచ్చుకునేవారట.

English summary

Tapsee in Hair oil advertisement the name called Nirmal Coconut oil.