ఏదీ సూటవ్వ లేదు

Tapsee Says That She Was Not Acting In Yash Raj Productions

10:23 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Tapsee Says That She Was Not Acting In Yash Raj Productions

నేను చేసిన సినిమాలన్నింటితో ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్నాను’ అని చెప్పే సొట్టబుగ్గల సుందరి తాప్సీ. గతేడాది తెలుగు మినహా ఇతర భాషల్లో నాలుగు సినిమాల్లో మెరిసింది ఇక . యశ్‌రాజ్‌ సంస్థలో సినిమా చేస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో ఈ డిల్లీ బ్యూటీ స్పందిస్తూ, 'ఆ సంస్థలో అవకాశం వస్తే అదృష్టమే కదా. ఒకవేళ అదే నిజమైతే నేనే ఆనందంగా ప్రచారం చేస్తా కదా’’ అని చెప్పుకొచ్చింది. ‘‘తెలుగు సినిమాతో నా కెరీర్‌ మొదలైంది. ఈ మధ్యకాలంలో తెలుగులో చాలా కథలు విన్నాను ఏదీ నాకు సూటవ్వ లేదు. అందుకే వచ్చిన అవకాశాలు వదులకున్నాను. తెలుగు పరిశ్రమ నుంచి ఎప్పుడు పిలుపొచ్చినా సినిమా చెయ్యడానికి నేను సిద్ధం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ఘాజి’తోపాటు రైజింగ్‌ సన్ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నా. దీనికి ఇంకా టైటిల్‌ పెట్టలేదు. ఈ రెండు సినిమాలు తప్ప మరో సినిమా అంగీకరించలేదు. యశ్‌రాజ్‌ బ్యానర్‌లో అవకాశం వచ్చిందనే ప్రచారంలో నిజంలేదు' అని వివరించింది. మరి తెలుగులో బాలయ్యతో కల్సి నటిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

`

English summary

Heroine Taapsee who were acted in most of the movies in Telugu.Recently she has not signed any telugu movie.Tapsee says that rejected some movies in Telugu because of that character does not suit her.Presently she was acting two hindi movies and she says that she was not working in Yash Raj Productions