రెండేళ్ళ తర్వాత తెలుగులో తాప్సీ 

Tapsi To Act After Two Yearts In Telugu

11:01 AM ON 11th December, 2015 By Mirchi Vilas

Tapsi To Act After Two Yearts In Telugu

ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు చిత్ర సీమకు హీరోయిన్‌ గా పరిచయమైన తాప్సీ తెలుగు లో అనుకున్నంత స్ధాయిలో రాణించలేకపోయింది . అనేక మంది స్టార్‌ హీరోల సరసన నటించినప్పటికీ తాప్సీకు గుర్తింపు రాలేదు. తాప్సీ చివరి సారిగా తెలుగులో హీరోయిన్‌గా నటించిన చిత్రం ''సాహసం'' ఈ చిత్రం వచ్చి దాదాపు రెండేళ్ళు పూర్తి అయ్యిపోతుంది. ఇక్కడ పెద్ద గా అవకాశాలు లేకపోవడంతో తమిళ చిత్రాల్లో నటించింది. తమిళ్ళంలో వరుస అఫర్లతో మంచి విజయాలను అందుకుంది ఇప్పుడు తమిళంలో తాప్సీ స్టార్‌ హీరోయిన్‌లో ఒకరు. ప్రస్తుతం తాప్సీ తెలుగులో రాణా సరసన ''ఘాజీ'' అనే చిత్రంలో నటిస్తుంది 1971 వ సంవత్సరంలో మునిగిపోయిన పాకిస్ధాన్‌ సబ్‌ మేరైన్‌ కథే ఘాజీ. ఇందులో పాత్ర చాలా క్లిష్టమైన పాత్ర కావడంతో అందుకోసం స్క్రిప్ట్‌ను బాగా అర్ధం చేసుకుని, ఈ నెలాఖరు లో ఘాజీ చిత్ర యూనిట్‌ తో కలిసి షూటింగ్‌ లో పాలుపంచుకోనుంది. సాహసం చిత్రం తరువాత మళ్ళీ హైదరాబాద్‌ రాని తాప్సీ ఇప్పుడు ఈ చిత్రంతో మళ్ళీ ఇక్కడ సందడి చెయ్యనుంది. ఒక వైరటీ కాన్సెప్ట్‌ తో తెకెక్కినున్న ఘాజీ చిత్రాన్ని నూతన దర్శకుడు సంకల్పరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్ధ పివిపి సినిమా వారు నిర్మిస్తూన్నారు. ఈ సినిమా తో అయినా తాప్సి తెలుగులో మంచి విజయాలను అందుకోవాలని కోరుకుందాం

English summary

Tapsee to act in telugu movies after two long years.Lastly tapsee acted in sahasam movie in telugu. Now she was acting in Ghaji movie along with Rana