విమానం అదృశ్యం

Tara Airlines Aeroplane Missed In Nepal

11:38 AM ON 24th February, 2016 By Mirchi Vilas

Tara Airlines Aeroplane Missed In Nepal

నేపాల్‌ పర్వతాల్లో బుధవారం ఉదయం తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అదృశ్యమైంది. ఈమేరకు అధికారులు వెల్లడించారు. అదృశ్యమైన విమానంలో దాదాపు 23మంది ఉన్నట్లు, వారిలో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే, తారా ఎయిర్‌లైన్స్‌ విమానం నేపాల్‌లోని పొఖారా నుంచి జామ్‌సోమ్‌కు వెళ్తుండగా ఉదయం 7.45 గంటలకు విమానం ఆచూకీ గల్లంతైందని ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారులు వెల్లడించారు. అదృశ్యమైన విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ల సహాయంతో గాలింపు కొనసాగిస్తున్నామని.. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు చర్యలకు ఆటంకమేర్పడుతోందని అంటున్నారు. పర్వత శ్రేణిలో అదృశ్యమైన ఈ విమానం లోని ప్రయాణికుల కోసం కుటుంబ సభ్యులు , బంధువులు ఆందోళన చెందుతున్నారు.

English summary

The Aeroplane which belonging to Tara airlines company carrying 23 persons including three crew members have gone missing in Nepal on Wednesday morning.The Air craft has missed at 7:45 am after taking off after 15 minutes.There were 23 passengers in that flight.