తారక్ అంటే ముఖ్యమంత్రి

Tarak Means Chief Minister In Google Translate

10:50 AM ON 19th July, 2016 By Mirchi Vilas

Tarak Means Chief Minister In Google Translate

అవును.. తారక్ అంటే ముఖ్యమంత్రి అని చెబుతోంది ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్. ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయి కూర్చుంది. గూగుల్ ట్రాన్స్ లేట్ లో "tarak" అని టైప్ చేస్తే వచ్చే తెలుగు ట్రాన్స్ లేషన్.. 'ముఖ్యమంత్రి' అని కనిపిస్తోంది. ఇది ఏ ప్రాతిపదికన ముఖ్యమంత్రి అని చూపిస్తుందనేది నెటిజన్లలో సరికొత్త చర్చకు తెరతీసింది.

ఇక గూగుల్ లో వచ్చే ఈ తరహా, వార్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి యమ ఖుషీగా వున్నాయట. దీనిని అడ్వాంటేజ్ తీసుకుని తమ అభిమాన హీరో ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాడని అందుకే అలా మీనింగ్ వస్తోందని చెప్పేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణాలో పార్టీ బతకాలంటే జూనియర్ ఎన్ టి ఆర్ ను ఆ రాష్ట్రానికి టిడిపి అధ్యక్షునిగా ప్రకటించాలనే డిమాండ్ కూడా గతంలో వచ్చిన నేపదాయంలో ఈ ట్రాన్స్ లేషన్ ఫాన్స్ కి కిక్కు ఇస్తోందట. నందమూరి తారక రామారావు.. ముఖ్యమంత్రి అన్నది కీ వార్డ్స్ లో సెనానేమ్స్ గా ఉండటంవల్లే ఈ ఔట్ వస్తుందని మరికొందరు అనే మాట. ఇప్పటికే గూగుల్ ట్రాన్స్ లేషన్ మీద చాలా సెటైర్లు వచ్చేశాయి. ఇచ్చే ఇన్ పుట్ కి వచ్చే అవుట్ పుట్ కు పోలిక ఉండటం లేదన్నది కొందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఇప్పటికే గూగుల్ ట్రాన్స్ లేషన్ మీద లీగల్ కంప్లైంట్స్ కూడా వెళ్లిపోయాయి. ఇదిలాఉంటే.. గూగుల్ అసలు రీజినల్ లాంగ్వేజెస్ మీద ఎందుకంత దృష్టిపెట్టాలని.. ప్రపంచంలో ఎన్నోభాషలున్నాయని అలాంటిది ఈ మాత్రం అయినా సేవ చేస్తున్నందుకు అభినందించాల్సిందిపోయి ఈ సెటైర్లేంటని మరికొందరి మాట. మొత్తానికి గూగుల్ లో ఈ మధ్య వస్తున్న కొన్ని అంశాలు కొంప ముంచేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:కొబ్బరి చెట్లతో భూకంపాలను అడ్డుకోవచ్చట!

ఇవి కూడా చదవండి:ఒక ద్రాక్ష పండు ఖరీదు తెలిస్తే.. గుండె గుభేల్!

English summary

Google Company has serving by its google translate service and by using it we came to know so many words meanings in different languages and recently some found that when we type "tarak" in google translate then it showing it as Chief Minister meaning in Telugu.