'కాకతీయుడు' కేక పెట్టిస్తాడట..

Tarak Ratna dual role in Kakatiyudu movie

11:31 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Tarak Ratna dual role in Kakatiyudu movie

శ్రావణ మాసం తొలి శుక్రవారం నాడు అంటే, ఈ శుక్రవారమే 'శ్రీరస్తు శుభమస్తు'.. 'మనమంతా' చిత్రాలతో పాటు 'కాకతీయుడు' కూడా విడుదల కాబోతోంది. పెద్ద ఎన్టీఆర్ కు 'బొబ్బిలి పులి' ఎలాగో.. చిన్న ఎన్టీఆర్ అదేనండీ హీరో నందమూరి తారకరత్నకు 'కాకతీయుడు' అలా ఉంటుందని నిర్మాత లగడపాటి శ్రీనివాస్ అంటున్నాడు. అదెంటో గానీ, కొంతమంది తారకరత్నను చిన్న ఎన్టీఆర్ అంటూంటారట. దర్శకుడు సముద్ర-తారకరత్న కాంబినేషన్లో చాన్నాళ్ల కిందటే కాకతీయుడు అనే సినిమా తెరకెక్కిన సంగతి చాలా మందికి తెలియదు. ఈ మధ్య 'రాజా చెయ్యి వేస్తే'లో విలన్.. 'మనమంతా'లో క్యారెక్టర్ రోల్స్ చేయడంతో తారకరత్న మళ్ళీ కొద్దిగా వార్తల్లోకి వచ్చాడు.

ఇదే మంచి తరుణం అనుకున్నారో ఏమో గానీ కాకతీయుడును బూజు దులిపి, బయటికి తీస్తున్నారు. ఎన్టీఆర్ కు 'బొబ్బిలిపులి'.. బాలయ్యకు 'సింహా'.. జూనియర్ ఎన్టీఆర్ కు 'ఆది'.. కళ్యాణ్ రామ్ కు 'అతనొక్కడే' ఎలాగో తారకరత్నకు కాకతీయుడు అలా. ఈ సినిమాతో తారకరత్నకు గొప్ప పేరు వస్తుంది అని నిర్మాత నమ్మకంగా చెప్పేస్తున్నాడు. ఇక దర్శకుడు సముద్ర మాట్లాడుతూ కాకతీయుడు కోసం తారకరత్న సిక్స్ ప్యాక్ చేసినట్లు చెప్పాడు. తారకరత్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. అన్న పాత్రలో లావుగా.. తమ్ముడి పాత్రలో సన్నగా కనిపిస్తాడు. అన్న పాత్ర కోసం తారకరత్న సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. రెండు పాత్రలకు వేర్వేరుగా కనిపించాల్సి ఉండటంతో పది నెలల పాటు షూటింగే చేయలేదు అంటూ సముద్ర వివరించాడు.

English summary

Tarak Ratna dual role in Kakatiyudu movie