చిరు పాలిట విలన్ గా మారిన అంజలా జవేరి మొగుడు

Tarun Arora is turned as a villan in Chiranjeevi 150th movie

11:29 AM ON 29th July, 2016 By Mirchi Vilas

Tarun Arora is turned as a villan in Chiranjeevi 150th movie

అవునా అంటే అవుననే సంకేతాలొస్తున్నాయి. రాజకీయాల్లోకి వెళ్ళాక మళ్ళీ సినిమాల్లో ఎంట్రీ ఇస్తూ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న భారీ చిత్రం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం అభిమానులంతా ఆతృతగా- ప్రేక్షకులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే షూటింగ్ మొదలైనా ఇంకా హీరోయిన్, ఇంకా కీలకమైన నటుల విషయం కొలిక్కి రాలేదు. అసలు ఈ సినిమాకి సంబంధిచిన వార్తలు మొదలైనప్పటినుండీ ఈ సినిమాపై ఆశలు - అంచనాలూ పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పైనా హీరోయిన్ పైనా ఇంకా క్లారిటీ రాలేదనేది తెలిసిన విషయమే. ఈ విషయంపై కత్తిలాంటోడు - ఖైదీ నెంబరు 150 - తాజాగా నెపోలియన్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో చిరంజీవికి ప్రతినాయకుడు ఎవరనేదానిపై తాజా చర్చ మొదలైంది.

ఈ మూవీ మాతృక అయిన తమిళ కత్తిలో విలన్ పాత్ర చేసిన నీల్ నితిన్ ముఖేష్ ఆ సినిమాలో మాంచి మార్కులే కొట్టేశాడు. అయితే తెలుగులో కూడా అతడినే ప్రతినాయకుడిగా ఎంపిక చేస్తారనే వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో రకరకాల విలన్స్ పేర్లు తెరపైకి వచ్చినా కానీ.. తాజాగా కొత్తపేరు ఒకటి హల్ చల్ చేస్తోంది. అది కూడా మరెవరో కాదు... చిరంజీవి సినిమాలోని హీరోయిన్ భర్త కావడం విశేషం. ఎవరా అని ఊహించుకుంటున్నారా? చిరంజీవితో 'చూడాలని ఉంది' సినిమాలో హీరోయిన్ గా నటించిన అంజలా జవేరి గుర్తుంది కదా. ఈమె పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఈమె భర్త తరున్ అరోరా నటుడే. అందుకే చిరు 150వ సినిమాలో విలన్ గా ఎంపిక చేయనున్నారట. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి చిరు పాలిట అంజలా జవేరీ మొగుడు విలన్ అవ్వబోతున్నాడన్న మాట.

English summary

Tarun Arora is turned as a villan in Chiranjeevi 150th movie