మరోసారి అదృష్టాన్ని పరిక్షించుకోనున్న తరుణ్‌

Tarun is testing his luck again

03:50 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Tarun is testing his luck again

లవర్‌బాయ్‌ తరుణ్‌ మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాడు. తరుణ్‌ ప్రేమకథా చిత్రాలలో నంటించి లవర్‌ బాయ్‌గా ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. అయితే ఈ మధ్య తరుణ్‌కి పెద్దగా హిట్‌లు రాకపోవడంతో కొంత గ్యాప్‌ వచ్చింది. ఈ గ్యాప్‌ తరువాత మరో విలక్షణమైన లవ్‌స్టోరీతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తరుణ్‌. ఓ అమ్మాయిని ఎంతకాలం ప్రేమించాం అన్నదికాదు ఎంతగా ప్రేమించామన్నదే ముఖ్యం అన్న వైవిద్యమైన కాన్సెప్ట్‌ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. జనవరి 8న తరుణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ను చేయనున్నారు. రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రమేష్‌ గోపి దర్శకుడిగా ఎస్‌.వి. ప్రకాష్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నటుడిగా ఆల్‌రౌండర్‌ అనిపించుకున్న తరుణ్‌ మరో సారి ఈ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు.

English summary

Tarun is testing his luck again. Tarun had a grand entry into Tollywood with a super hit film ‘Nuvve Kavali’ fifteen years ago.