ఏటీఎంల అప్ గ్రేడ్ కు రంగం సిద్ధం

Task force was ready for Atm's upgrade

12:05 PM ON 15th November, 2016 By Mirchi Vilas

Task force was ready for Atm's upgrade

ఏటీఎంల ప్రక్షాళనకు రంగం సిద్ధం అవుతోంది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు త్వరితగతిన పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎస్ ఎస్ ముంద్రా ఛైర్మన్ గా టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటయింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంల ద్వారా తక్కువ సమయంలో రూ.2వేల నోట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఇది కృషి చేస్తుంది. ప్రస్తుతం ఏటీఎంల ద్వారా వేగంగా రూ.2వేల నోట్లను ఖాతాదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. రూ.2వేల నోట్లను డ్రా చేసుకునేందుకు అనువుగా వీలైనన్ని ఏటీఎంలలో మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉంది.

1/4 Pages

ఇందుకోసం ఎస్ ఎస్ ముంద్రా ఛైర్మన్ గా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ తెలిపారు. ఇక ఆర్థిక, హోం మంత్రిత్వశాఖలతో పాటు బ్యాంకులకు చెందిన ఎనిమిది మంది సభ్యులు టాస్క్ ఫోర్స్ బృందంగా ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ బృందం, బ్యాంకులతో పాటు వివిధ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ ఏటీఎంలలోని హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను రూ.2వేల నోట్లు జారీకి అనుగుణంగా త్వరితగతిన మార్చేందుకు కృషి చేస్తుందని అంటున్నారు.

English summary

Task force was ready for Atm's upgrade