ఆర్అండ్ డీలో టాటాకు 49వ ర్యాంకు

Tata Motors on top-50 global R&D list

03:52 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Tata Motors on top-50 global R&D list

ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్‌అండ్‌డి) కార్యకలాపాల్లో టాప్-50 సంస్థల జాబితాలో ఒకే ఒక్క భారత సంస్థకు చోటు లభించింది. వార్షిక ఇండస్ట్రియల్ ఆర్అండ్‌డి ఇన్వెస్ట్ మెంట్ స్కోరు బోర్డును యూరోపియన్ కమిషన్ విడుదల చేసింది. అందులో వోక్స్ వాగన్ తొలి స్థానంలో నిలవగా.. భారత్‌కు చెందిన టాటా మోటార్స్ 49వ స్థానంలో నిలిచింది. గతేడాది 104వ స్థానంలో ఉన్న టాటా మోటార్స్ తాజాగా మెరగవడం విశేషం. శామ్‌సంగ్ రెండు, మైక్రోసాఫ్ట్ మూడు, ఇంటెల్ నాలుగు, నోవార్టిస్ 5వ స్థానాన్ని దక్కించుకున్నాయి. టాప్ 50తో పాటు టాప్‌ 2500 జాబితాను యూరోపియన్ కమిషన్ విడుదల చేసింది. అందులో 26 భారత కంపెనీలకు చోటు లభించగా.. అమెరికా 829, జపాన్ 360, చైనా 301, తైవాన్ 114, స్విట్జర్లాండు 80, కెనడా, ఇజ్రాయిల్‌కు చెందిన 27 కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి.

English summary

Tata Motors Company has entered in the top-50 list of the world's biggest companies in terms of their R&D investments, in that list German automaker Volskwagen stands at first.