‘ఎయిర్‌లిఫ్ట్‌’ కి టాక్స్ లేదు 

Tax Exemption For Air Lift Movie

01:35 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Tax Exemption For Air Lift Movie

కొన్ని చిత్రాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వినోదపు పన్ను రాయితీ ఇవ్వడం , పన్ను నుంచి పూర్తిగా మినిహాయింపు ఇవ్వడం చేస్తుంటాయి. అలాగే ఇటీవల విడుదలై, వసూళ్లతో దూసుకెళ్తున్న ‘ఎయిర్‌లిఫ్ట్‌’ చిత్రానికి ఉత్తర్‌ప్రదేశ్‌ లో పన్ను రద్దు చేసారు. ఈ మేరకు యూపి ప్రభుత్వం ప్రకటించింది. కువైట్‌లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా నూతన దర్శకుడు రాజా కృష్ణ మెనన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి చిత్రానికి మంచి రివ్యూలు లభిస్తున్నాయి. పన్ను రద్దు అయిన విషయాన్ని నటులు అక్షయ్‌కుమార్‌, నిమ్రత్‌కౌర్‌లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. యుపి ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కి వారు కృతజ్ఞతలు తెలిపారు.

English summary

Uttar Pradesh Government Has given Tax Exemption to Akshay Kumar's Air Lift Movie. This movie was directed by Raja krishna Menon.Akshay Kumar, Nimrat Kaur, Purab Kohli and Lena was played lead roles in the movie