టికెట్ లేదని పక్క భోగీలోకి తీసుకెళ్ళి రేప్ చేసిన టీసీ!

TC raped a girl in train for not having a ticket

03:56 PM ON 6th June, 2016 By Mirchi Vilas

TC raped a girl in train for not having a ticket

ఏ దేశంలో అయినా బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అందులో ప్రయాణిస్తున్న వారి దగ్గర టికెట్ లేకపోతే వారికి జరిమానా విధిస్తారు. ఒకవేళ జరిమానా కట్టలేకపోతే ఒక రోజు లేదా రెండు రోజులు పోలీసులకు అప్పగిస్తారు. అయితే ఘజియాబాద్ లో మాత్రం టికెట్ లేని కారణంగా ఒక టీసీ అందులో ఒక ప్రయాణికురాలిని రేప్ చేసి శిక్ష విధించాడు. చిన్న నేరంకు పెద్ద శిక్ష వేసిన టీసీకి ఇప్పుడు అంతకంటే పెద్ద శిక్ష పడబోతుంది. జైలులో ఉన్న టీసీ పై విచారణ వేగంగా జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాంపూర్ నుండి జైపూర్ వెళ్తున్న హజ్రత్ ఎక్స్ ప్రెస్ లో ఒక మహిళ ఏదో కారణం చేత టికెట్ లేకుండా ప్రయాణం చేస్తోంది.

అదే బోగీలోకి డ్యూటీ దిగి తన నివాస ప్రాంతంకు వెళ్తున్న టీసీ రవిమీనా వచ్చాడు. టీసీ రాగానే ఆ మహిళ కంగారు పడటం మొదలు పెట్టింది. దాంతో అదే అదునుగా గ్రహించిన రవి టికెట్ అడిగాడు. అందుకు ఆమె టికెట్ తీసుకోలేదు అని సమాధానం చెప్పింది. వెంటనే తనతో రావాల్సిందిగా ఆ ప్రయాణికురాలికి చెప్పి అతను ముందుకు వెళ్ళిపోయాడు. ఆ టీసీ వెనుక ఆ ప్రయాణికురాలు కూడా వెళ్లింది. నిర్మానుషంగా ఉన్న ఒక భోగీలోకి ఆ ప్రయాణికురాలిని తీసుకు వెళ్లి రేప్ చేశాడు. రెండు సార్లు ఆమె పై దాడి చేసి తన కోరికను తీర్చుకున్నాడు.

రైలు ఆగిన వెంటనే రైల్వే పోలీసులకు టీసీ పై ఫిర్యాదు చేసింది. ప్రయాణికురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు టీసీ పై నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. అయితే టీసీ మాత్రం ఆమె ఒప్పుకున్న తర్వాతే తాను సెక్స్ చేశానని, ఇప్పుడు ఆమె రేప్ అంటుందని మొర పెట్టుకుంటున్నాడు.

English summary

TC raped a girl in train for not having a ticket