చెన్నై టిసిఎస్ఉద్యోగులకు 1,100 కోట్లు

TCS To Spend 1100 crores for chennai employees

10:40 AM ON 12th December, 2015 By Mirchi Vilas

TCS To Spend 1100 crores for chennai employees

ఇటీవల చెన్నై మహానగరానికి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో వేలాది మంది ప్రజల సర్వం కోల్పోయారు. చెన్నైలోని పలు ఐటి హబ్‌లు కూడా నాశనం అయ్యాయి. వేలాది మంది ప్రజలతో పాటు,ఐటి ఉద్యోగుల కూడా సమస్తం కోల్పోయారు.

పలువురు టీసీఎస్‌ సంస్థ ఉద్యోగులు తమ ఇళ్ళలోని సామాన్లు, వాహనాలు, ఆస్తులు ధ్వంసం కావడంతో చలించిపోయిన టీసీఎస్‌ సంస్థ వారిని ఆదుకునేందుకు 1,100 కోట్లను విడుదల చెయ్యాలని నిర్ణయించుకుంది. వడ్డీ లేకుండా క్యాష్‌ను అడ్వాన్సుల రూపంలో ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని టీసీఎస్‌ సంస్థ తెలిపింది.

ప్రతీ ఒక్క ఉద్యోగికి కనీసం లక్ష రూపాయల నుండి అధికంగా మూడు నెలల వేతన్నాని అడ్వాన్స్‌గా తమ సంస్థ ఉద్యోగులకు ఇవ్వనున్నట్లు టీసీఎస్‌ ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ పోర్టల్‌లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ ఎన్‌ చంద్రశేఖర్‌న్‌ అన్నారు.

చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ తమ ఉద్యోగులు నష్టపోవడం తమను కలచివేసింది. వారందరూ వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని చెన్నై టీసీఎస్‌ ఉద్యోగులను ఆదుకునేందుకు ఎంతటి ఖర్చు అయినా చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.

దీంతో పాటు ఇళ్ళను కోల్పోయిన తమ ఉద్యోగులకు అదనంగా ఒక నెల జీతం ఇవ్వదలిచామని, ఆసుపత్రి ఖర్చంతా తామే భరిస్తామని అన్నారు. అంతేకాక వాహనాలు కోల్పోయిన వారికి ఈ నెల 31 వరకు ఉచితంగా బస్సు సదుపాయాన్నిఅందిస్తామని , ఉద్యోగుల పిల్లలకు ఉచిత మెడికల్‌ క్యాంపులను నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం చెన్నైలో టీసీఎస్‌ కు 13 బ్రాంచ్‌లు ఉండగా, ఇందులో దాదాపు 60 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

English summary

Tata Consulting Services (TCS) to spend 1,100 crores of money to the software employees who are in chennai. Recently many of the employees lost everything by heavy rains and floods