ప్రతి ఇంటికి సెట్ అప్ బాక్సులు ఫ్రీ అట 

TDP-BJP Manifesto For GHMC Elections

10:58 AM ON 25th January, 2016 By Mirchi Vilas

TDP-BJP Manifesto For GHMC Elections

టిడిపి - బిజెపి మానిఫెస్టో

హైదరాబాద్ ను పూర్తి వైఫై నగరంగా మార్చడంతో పాటు ప్రతి ఇంటికి ఉచితంగా సెటప్ బాక్స్ లు పంపిణీ చేస్తామని బిజెపి - టిడిపి హామీ ఇచ్చాయి. ఈ మేరకు గ్రేటర్ ఎన్నికల ఉమ్మడి ప్రణాళిక విడుదల అయ్యింది. హ్యాపీ హైదరాబాద్ పేరుతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్ ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో పాటు టీడీపీ - బీజేపీ ముఖ్యనేతలు విడుదల చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ లో పలు కీలకహామీలతో పాటు భవిష్యత్ కార్యాచరణను కూడా పేర్కొంది. ఇతర ప్రధాన పార్టీలకు తీసిపోని విధంగా హైదరాబాద్ ప్రజలకు హామీలు ఇచ్చారు.

ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్ ఇస్తామని, 200 గజాల్లోపు స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు ఉండాలన్న నిబంధనల రద్దు పేదలకు వంద శాతం మధ్య తరగతి వారికి 50 శాతం సబ్సిడీతో సోలార్ విద్యుత్ అందిస్తామని , ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామని, ముఖ్యమైన కూడళ్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని, ప్రతి డివిజన్లో మొబైల్ ఆస్పత్రులు ఏర్పాటుచేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో టిడిపి - బిజెపి పేర్కొన్నాయి.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు. అవినీతి రహిత పాలన అందజేస్తామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ హైదరాబాద్ ని అభివృద్ధి పథంలో చంద్రబాబు నడిపించారని, ఇపుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోడితో మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందని వివరించారు.

English summary

TDP and BJP parties jointly released the election Manifesto for upcoming Greater Hyderabad Municipal Corporation elections.They said that they will provide free setup boxes in Hyderabad and make hyderabad as wifi city