ఎట్టెట్టా మీరు చేస్తే ఒప్పు - మేం చేస్తే తప్పా

TDP-BJP war on West Godavari

06:24 PM ON 30th December, 2015 By Mirchi Vilas

TDP-BJP war on West Godavari

వైసిపి నేతలను చేర్చుకోవడంపై టిడిపి - బిజెపి రగడ

ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి... మేం ఎవరినైనా చేర్చుకుంటాం ... మీరు మాత్రం మది కట్టుకు కూర్చోండన్నట్టుగా వుంది తెలుగు తమ్ముళ్ళ వ్యవహారం. నెల్లూరులో ఆనం బ్రదర్స్ ని చేర్చుకున్న టిడిపి , కడపలో ఎం ఎల్ ఎ ఆదినారాయణ రెడ్డి , విశాఖలో కొణతాల రామకృష్ణ - గండి బాబ్జీ తదితరులను కలుపుకోడానికి వ్యూహం పన్నుతూ , వైసిపిని నిర్వీర్యం చేస్తుంటే, మిత్ర పక్షమైన కమలనాధులు మాత్రం వైసిపి వాళ్ళను దరిచేరనివ్వ కూడదట. భలే వుంది కదా ...

ఈ అంశానికి సంభంధించే , పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి - బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. మిత్రభేదం సృష్టించడానికి ఎవరో పనిగట్టుకునే అవసరం లేకుండానే మిత్రుల మధ్య రగడ సాగిపోతోంది. పోనీ ఇదేమైన నాలుగు గోడల మధ్య సాగిందని సరిపెట్టుకుందామను కుంటే పొరపాటే. కావాలనే దీన్ని చిత్రీకరించి , సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో సోషల్ మీడియా లో ఇద్దరి మధ్య రచ్చ

వెస్టు గోదావరిలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడి జడ్పీ చైర్మన్ - టీడీపీ నేత బాపిరాజు - ఏపీమంత్రివర్గంలో ఉన్న బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు మధ్య గొడవ జరిగింది. బాపిరాజు మాణిక్యాలరావుపై వీర లెవెల్లొ రేజయ్యారు. అంతే ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఆ సమయంలో అక్కడున్న టీడీపీ మంత్రి ఇద్దరికీ సర్ది చెప్పి సముదాయించారు. కానీ ఈ సీనంతటినీ ఫోన్ లో వీడియో తీసిన ఓ టీడీపీ నేత దాన్ని ఫేస్ బుక్ లో పెట్టేసరికి ఇంకేముంది .... రచ్చ రచ్చే గా .... అద్గదీ సంగతి ....

Source : ABN

English summary