జోగయ్య ఆత్మ కథ పై  మండిపడుతున్న తెలుగు తమ్ముళ్ళు

TDP Fires On Jogayya's Auto-Biography

06:26 PM ON 5th November, 2015 By Mirchi Vilas

TDP Fires On Jogayya's Auto-Biography

మాజీ ఎంపి చేగొండి హరి రామ జోగయ్య రాసిన ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై దుమారం కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారు. జోగయ్య పై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. 60 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావిస్తూ జోగయ్య 166 పేజీల పుస్తకం రాసారు. పుస్తకావిష్కరణకు హేమాహేమీలు హాజరయ్యారు . వంగవీటి రంగా హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ , సిఎమ్ చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కావాలనే సాక్షి పత్రికలో ఈ అంశాన్ని వక్రీకరించి , వివాదం చేసారని ఎం ఎల్ ఎ నిమ్మల రామానాయుడు విమర్శిస్తుంటే , జోగయ్య పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎపి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు డిమాండ్ చేసారు . 'జోగయ్య రాసిన పుస్తకం లోని 74వ పేజీలో"ప్రజాధనాన్ని దోచుకుంటూ దొరవలె చలామణి కావడంలో ఆరితేరారు "అంటూ మాజీ సిఎమ్ డాక్టర్ రాజశేఖర రెడ్డి నుద్దేశించి రాస్తే , ఆవిషయం సాక్షి లో ఎందుకు ప్రస్తావించలేదని నిమ్మల రామానాయుడు ప్రశ్నిస్తున్నారు. ఇక ఆత్మకథల పేరిట ప్రముఖులను నిందించడం పరిపాటిగా మారిందని కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా జోగయ్య రాతలున్నాయని పలువురు టిడిపి నేతలు ధ్వజ మెత్తు తున్నారు . పుస్తకావిష్కరణ కు కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి , పలువురు టిడిపి నేతలు హాజరయ్యారు . తీరా పుస్తకంలో రాసున్న విషయాలు చూస్తే వివాదం రేపాయి. అబ్బో ఇకనుంచి పుస్తకం చదివాకే ఆవిష్కరణ లకు వెళ్లాలని నేతలు గట్టి నిర్ణయం తీసుకుంటా రేమో మరి .

English summary

TDP Fires On Harirama Jogayya's Auto-Biographgy TDP demands to take action on Har iRama Jogayya.TDP Says He used to write against on Chief Minister of Andhrapradesh Nara ChandrababuNaidu.