చంద్రబాబుకి మోడీ ఎర్త్ పెడతారా-గట్టేక్కిస్తారా

TDP into Troubles in Voting On Special Status To AP

10:34 AM ON 12th May, 2016 By Mirchi Vilas

TDP into Troubles in Voting On Special Status To AP

ముందు నుయ్యి , వెనుక గొయ్యి అనే సామెత ఉండనే ఉందిగా ..ఇప్పుడు రాజకీయ వ్యూహ నిపుణుడు ఎపి సిఎమ్ చంద్రబాబు పరిస్థితి అలానే వుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మొండిచెయ్యి చూపడంతో ఎపి రాజకీయాలు వేడెక్కి పోయిన సంగతి తెల్సిందే. ఇప్పటికే వైస్సార్ సిపి దీనిపై కారాలు మిరియాలు నూరుతూ చంద్రబాబుని దెప్పి పొడుస్తోంది. ఇక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 13వ తేదీన రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్ర రావు ప్రైవేటు బిల్లు పెట్టడం, దీనిపై ఇప్పటికే రాజ్యసభలో చర్చ జరగడం పూర్తయ్యాయి. ఇక ఈనెల 13న ఓటింగ్ జరగాల్సి ఉంది. ఇదే ఇప్పుడు ఎపిలోని అధికార తెలుగుదేశం పార్టీకి చిక్కులు తెప్పించేలా కనిపిస్తోంది. ఈ అంశం టిడిపిని ఇరకాటంలో పడేసింది. బిల్లుకు సపోర్ట్ చేస్తే కేంద్రంలోని అధికార బిజెపితో చిక్కు.. చేయకుంటే ప్రత్యేక హోదా వ్యతిరేకి అన్న ముద్ర పడిపోతుంది. ఇలా రెండిటి మధ్య ఆ పార్టీ నలిగిపోతోందని అంటున్నారు. ఇక దీని నుంచి ఎలా బయటపడాలనే ఎన్నో సమాలోచనలు..వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమైపోయారు ఆ పార్టీ సీనియర్లు.

ఇవి కూడా చదవండి:హైదరాబాద్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటున్న సమంత!

ఈ విషయంలో చంద్రబాబుకు ఎర్త్ పెట్టాలా? గట్టేక్కించాలా అనేది ప్రధాని మోడీ చేతుల్లోనే ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ టిడిపిని ఒడ్డున పడేయాలంటే, 13వ తేదీకంటే ఒకరోజు ముందే రాజ్యసభను నిరవధిక వాయిదా వేసి, తద్వారా టిడిపి సర్కారుకి ఉపశమనం కలిగించే అవకాశం ఎన్డియె సర్కారు చేయవచ్చని అంటున్నారు. రాజ్యసభలో తగినంత బలం లేక ఆత్మరక్షణలో పడేకంటే ఇదే బెటరని ఎన్డీయె నేతలు అడుగులు వేసే అవకాశం ఉందంటున్నారు. రాజ్యసభలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయె కు సరైన బలం లేకపోవడం, మరో వైపు ప్రత్యేక హోదాపై ప్రయివేటు బిల్లుకు అందరూ మద్దతు పలకాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విప్ జారీ చేయడం, ఎపిలోని వైస్సార్ సిపి మద్దతు పలకడం నేపధ్యంలో టిడిపి పై కూడా మద్దతు కోసం వత్తిడి పెరుగుతోంది. ఇక ఈ అంశాన్ని కేంద్రంలోని బిజెపి ఎలా అధిగమిస్తుందని సహజంగానే ఆసక్తికరంగా మారింది. మొత్తానికి టిడిపికి పెద్ద ఇబ్బందే వచ్చి పడింది.

ఇవి కూడా చదవండి:ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ హీరో

ఇవి కూడా చదవండి:బతికుండగానే సమాధి చేసేసారట

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu was in deep confusion that the voting process on Special Status Issue on 13th May. Congress Party Senior leader KVP was passed a Private bill and the voting to be done on 13th May. Ysrcp joined hands with Congress party on this issue.