పవన్ ని టీడీపీ నేత అలా ఎందుకన్నాడు?

TDP leader Jupudi Prabhakar Rao praises Pawan Kalyan

04:32 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

TDP leader Jupudi Prabhakar Rao praises Pawan Kalyan

ప్రత్యేక హోదాపై పోరాటం అని ప్రకటించిన పవన్ తిరుపతి సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీకి చెందిన ఎంపీలు ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. కొంతమంది అయితే పవన్ ఆవేదన కూడా మా ఆవేదనే అంటూ సరిపెట్టేసారు. మొత్తానికి సీఎం చంద్రబాబు నుంచి ఇంచుమించు ప్రతినాయకుడు పవన్ వ్యాఖ్యలపై స్పందించాడు. అయితే డిఫరెంట్ గా టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ ఎలా పొగిడారో తెలిస్తే పిచ్చెక్కిపోతుందని పలువురు అంటున్నారు. ఇంతకీ ఏమన్నాడంటే, పవన్ సాధారణ రాజకీయ నాయకుడు కాదట. అలా అని కాపు నాయకుడు అనుకోరాదట. అంతకు మించి పవన్ ప్రజల హీరో అంట..

పవన్ కళ్యాణ్ కాపు జాతికి మాత్రమే కాదు, కులమతాలకు అతీతుడు సమాజంలో అణగారిన వర్గాలకు అండగా నిలవడానికొచ్చిన సంఘ సంస్కర్త, విప్లవ నాయకుడు అని జూపూడి ఆకాశానికి ఎత్తేశాడు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా నిజమైనహీరోగా ప్రజలందరీ మన్ననలు అందుకుంటున్న నాయకుడు పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ అని జూపూడి అంటున్నాడు. ఈ పొగడ్తలు విన్న పవన్ కి ఎలా ఉంటుందో కానీ.. ఆయన అభిమానులు తెలుగు దేశం కార్యకర్తలు సామాన్య జనాలు మాత్రం ఇది జూపూడి మార్క్ పీక్స్ అని చెప్పుకుంటున్నారట.

బాబోయ్.. జూపూడి పొగడటం మొదలుపెడితే ఈ స్థాయిలో ఉంటుందా అని ఆయనకున్న అభిమానులు కూడా ముక్కుపై వేలేసుకుంటున్నారట. ఇంతకూ ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, కాపు ఉద్యమంలో పవన్ ను కలుపుకొనేది లేదని ఆ సామాజికవర్గం కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంపై ముద్రగడ ప్రకటనను ఖండించడం మొదలుపెట్టిన జూపూడి స్టీరింగ్ ఇలా పవన్ ప్రశంసలవైపు మళ్లించాడని అంటున్నారు.

ఇది కూడా చదవండి: హరికృష్ణ గురించి సంచలన విషయాలు

ఇది కూడా చదవండి: అడ్డంగా దొరికేసిన 'లోఫర్' హీరోయిన్

ఇది కూడా చదవండి: ఎవరూ నమ్మలేని భయంకర విషయాలు

English summary

TDP leader Jupudi Prabhakar Rao praises Pawan Kalyan