కారు ఎక్కిన కృష్ణాయాదవ్ 

TDP Leader Krishna Yadav Joins In Trs

01:39 PM ON 25th January, 2016 By Mirchi Vilas

TDP Leader Krishna Yadav Joins In Trs

గ్రేటర్ ఎన్నికల వేళ పార్టీలు జంప్ చేయడం జోరుగానే సాగుతోంది. ఈ విషయంలో టిఆర్ఎస్ లోకి చేరేవారి సంఖ్య హెచ్చుగా వుంది. ఒకప్పుడు టిడిపిలో కీలక పాత్ర వహించి, స్టాంపుల కుంభకోణం లో జైలుకెళ్ళిన మాజీ మంత్రి సి కృష్ణయాదవ్ ఆ మధ్య అట్టహాసంగా టిడిపిలో చేరినా, తాజాగా కారు ఎక్కేసారు. సోమవారం కృష్ణా యాదవ్ టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న నేపధ్యంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కెటిఆర్) మాట్లాడుతూ ఏం ఆశించకుండా కృష్ణా యాదవ్ టిఆర్ఎస్ లో చేరారని చెప్పారు . మంత్రి కెటిఆర్ సమక్షంలో కృష్ణ యాదవ్ తో పాటూ కాంగ్రెస్ నేత దిడ్డి రాంబాబు తదితరులు టిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. అన్ని పార్టీల కార్యాలయాలకు తాళాలు పడ్డాయని కెటిఆర్ వ్యాఖ్యానిస్తూ, గాంధీ భవన్‌కే రక్షణ కల్పించలేని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక సీమాంధ్రులకు ఏం కల్పిస్తారని ఎద్దేవా చేశారు. ఇక టిడిపి కార్యాలయంలో అర్ధనగ్న ప్రదర్శనలు జరుగుతుంటే, బిజెపి కార్యాలయంలో కుర్చీలు లేస్తున్నాయని కెటిఆర్ పేర్కొంటూ, ఒక్క టిఆర్ఎస్ లోనే విజయోత్సవం కనిపిస్తోందన్నారు. యుగానికి ఒక్కరే కెసిఆర్ లాంటి వ్యక్తి పుడతారని కెటిఆర్ అనడం కొసమెరుపు.

English summary

Telangana Telugu Desam Party Leader Ex- Minister Krishna Yadav Joins in Telangana Rashtra Samiti (TRS) party. This was said by Telangana IT minister KTR and he fired on Congress and TDP and BJP parties