జూనియర్ ప్రస్తావనతో వేటు పడింది  

TDP Leader Suspended In Hyderabad

12:02 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

TDP Leader Suspended In Hyderabad

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ధిక్కార స్వనాలు విన్పిస్తూ ఆందోళన చేస్తున్న తీరు అన్ని పార్టీల్లో నెలకొంది. నేతల ఇళ్ళముందు , కార్యాలయాల దగ్గర ఆందోళనలు సాగిస్తున్నారు. టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది ఓ సైడ్ అయితే మరో సైడ్ చూస్తే పార్టీ సారధ్య బాధ్యతలు మార్చాలని టిడిపిలో డిమాండ్ లేవనెత్తారు. అది కూడా తెలంగాణ పార్టీ బాధ్యతలను మార్చేసి , జూనియర్ ఎన్టిఆర్ కి అప్పగించాలని డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తిపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

వివరాల్లోకి వెళితే, జిహెచ్ఎంసి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, పార్టీ తెలంగాణ నేతలు సీట్లు అమ్ముకున్నారని టిడిపికి చెందిన నైషథం సత్యనారాయణ మూర్తి తీవ్రంగా ఆరోపించాడు. అంతటితో ఆగకుండా తెలంగాణలో టిడిపిని బతికించాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కు అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. దీంతో ఆయన పై టిడిపి అధిష్టానం తీవ్రంగా ప్రతిస్పందించింది.
సత్యనారాయణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిడిపి నగర అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రకటించారు. నైషథం సత్యనారాయణ మూర్తి రాంనగర్ డివిజన్ నుంచి టిడిపి, కాంగ్రెసు, బిజెపిల పేరుతో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని, ఆయన భార్య అడిక్‌మెట్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారని, దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు గోపీనాథ్ వివరించారు.

అయితే, పార్టీ సీనియర్ నాయకుడినైన తనను సస్పెండ్ చేసే హక్కు జిల్లా పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు లేదని సత్యనారాయణమూర్తి వాదించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణతో ఈ విషయమై వాగ్వివాదానికి దిగారు.ఆ తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను ఎన్టీఆర్ విగ్రహానికి సమర్పించడం కొసమెరుపు.

English summary

Teleangana TDP leader Satyanarayana murthy was suspended by Jubliee Hills TDP MLA And Hyderabad TDP leader Maganti Gopinadh.He was suspended because of his concern on alotting tickets for GHMC elections