అది కాల్చబోతే... ఇది కాలిందిరో(వీడియో)

TDP leaders burns Jagans effigy at Vijayawada

10:59 AM ON 4th June, 2016 By Mirchi Vilas

TDP leaders burns Jagans effigy at Vijayawada

ఒక్కోసారి మనం చేసే పనులు సరిగ్గా లేకపోతే చివరకు అవి బెడిసి కొట్టి, తమనే చుట్టుకుంటాయి. ఇది కూడా అలాంటిదే. టిడిపి అధినేత, ఏపి సిఎమ్ చంద్రబాబును చెప్పుతో కొట్టాలి అంటూ, జగన్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు విజయవాడ టిడిపి శ్రేణులు భగ్గుమన్నాయి. ఇందులో భాగంగా వైసిపి అధ్యక్షుడు జగన్ దిష్టి బొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించడంతో, అపశృతి దొర్లింది. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు చేతిలో దిష్టిబొమ్మ ఉండగానే మరో వ్యక్తి నిప్పంటించడంతో, అనుకోకుండా సాంబశివరావు చొక్కా సహా ఒళ్లు కాలిపోయింది.

ఇదిలా ఉంటే, దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో దిష్టిబొమ్మను గట్టిగా పట్టుకొని కార్పొరేటర్ సాంబశివరావు ఉన్నారు. ఈలోగా మరో కార్యకర్త అగ్గిపుల్ల వెలిగించి దిష్టి బొమ్మకు నిప్పంటించారు. దీంతో ఒక్కసారిగా మంటలు, ఒళ్లంతా వ్యాపించాయి. దీంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అదండీ సంగతి. కాగా డా. రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్పొరేటర్ జాస్తి సాంబశివరావును ఏపి సిఎమ్ చంద్రబాబు పరామర్శించారు.

English summary

TDP leaders burns Jagans effigy at Vijayawada