బాలయ్య అల్లుడే బాహుబలి...

TDP Mahanadu in Tirupati

03:49 PM ON 27th May, 2016 By Mirchi Vilas

TDP Mahanadu in Tirupati

అవునా అంటే అవునో కాదో తేలాలి మరి. ఎందుకంటే ఎస్ ఎస్ రాజమౌళి దర్శక ప్రతిభకు అద్దంపట్టే విధంగా బాహుబలిని తీర్చిదిద్దాడు. ప్రపంచమంతటా ఈ చిత్రం దూసుకుపోయింది. చివరకు జాతీయ స్థాయిలో తొలి తెలుగు ఉత్తమ చిత్రంగా కూడా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా మాంచి జోరు సాగించింది. ఇక బాహుబలి కంక్లూజన్ మీద జక్కన్న దృష్టి పెట్టాడు. బాహుబలి పేరు అన్ని చోట్లా వినిపించేలా ఈ సినిమా అందరి నోళ్ళల్లో నానుతూనే వుంది. ఇప్పుడు పొలిటికల్ లీడర్ల పై గా కూడా ఈ సినిమా ప్రభావం చూపిస్తోంది. మూడు రోజుల పాటు తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన టిడిపి మహానాడు శుక్రవారం సందడిగా ప్రారంభమైంది. పసుపు తోరణాలు , భారీ ఫ్లేక్స్ లతో , పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ జరుగుతున్న ఈ మహానాడులో కూడా బాహుబలి చర్చకు వచ్చేసింది. కారణం యువనేత , చినబాబు లోకేష్ ని బాహుబలి గెటప్ లో మహానాడు ప్రాంగణం దర్శనమిస్తోంది. భారీ ఫ్లేక్స్ ఏర్పాటు చేయడంతో అందరి దృష్టి ఆటే పడుతోంది.

ఇది కూడా చూడండి :రజనీ కుటుంబం కదిలింది.....

ఇది కూడా చూడండి :భార్యతో కలిసి చిందేసిన 'సరైనోడు'

ఇది కూడా చూడండి :ఈ డ్రింక్ తీసుకుంటే, అధిక బ‌రువు మాయం!

English summary

TDP Mahanadu in Tirupati.