శివాజికి తెలుగు తమ్ముళ్లు తలంటేసారు !(వీడియో )

TDP MLC Somireddy Chandramohan Reddy Fires On Sivaji

11:01 AM ON 3rd September, 2016 By Mirchi Vilas

TDP MLC Somireddy Chandramohan Reddy Fires On Sivaji

ఇన్నాళ్లూ ప్రత్యేక హోదాపై గళం విప్పుతూ తీవ్ర విమర్శలతో వార్తల్లోకి ఎక్కిన ఎపి ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు, హీరో శివాజీ తాజాగా కేంద్ర మంత్రి సుజనాచౌదరిపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. తెలుగు తమ్ముళ్లు దీనిపై అభ్యంతరం చెప్పారు. టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈమేరకు మాట్లాడుతూ సుజనాచౌదరి రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఏనాడూ వ్యాపారాలు చేయలేదని వ్యాఖ్యానించారు. సుజనా వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారని, ఆర్థిక ఇబ్బందులు వేరు, ఆర్థిక నేరాలు వేరని, సుజనాచౌదరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు తప్ప ఆర్థిక నేరాలకు పాల్పడలేదని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. శివాజి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మరో టిడిపి నేత బొండా ఉమ ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి:శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం(ఫోటోలు)

ఇవి కూడా చదవండి:పవన్ ని టీడీపీ నేత అలా ఎందుకన్నాడు?

English summary

Hero and Special Status Demanding person Sivaji fired recently on Andhra Pradesh MP's and made some controversial comments on MP Sujana Chowdary. Now TDP MLC Somireddy Chandramohan Reddy Fires on Sivaji for his comments on Sujana Chowdary.