ఈసారి అంబేడ్కర్ వేషంలో కేంద్రం పై చురకలు

TDP MP Siva Prasad in Ambedkar Getup At Parliament

11:30 AM ON 10th May, 2016 By Mirchi Vilas

TDP MP Siva Prasad in Ambedkar Getup At Parliament

తెలుగుదేశం సీనియర్ నేత , చిత్తూరు ఎంపి డాక్టర్ శివప్రసాద్ తీరే వేరు. సినీమాలలో కూడా వేషాలు వేసి మెప్పించే ఈయన నిజ జీవితంలో కూడా రంగు పోసుకుని తనదైన మార్కు చూపిస్తుంటారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో డాక్టర్ శివప్రసాద్ పోషించిన రోల్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. నిత్యం ఏదో ఒక వేషం వేసి.. పార్లమెంటు దగ్గర షో నడిపించిన శివప్రసాద్ కారణంగా ఏపీకి ఎలాంటి ప్రయోజనం కలగకున్నా..ఆయన ఇమేజ్ మాత్రం భారీగా పెరిగిందని చెప్పాలి. విభజనకు వ్యతిరేకంగా చిత్తూరు ఎంపీ కష్టపడి వేషాలు కట్టటం అందరి దృష్టిని ఆకర్షించేది. అయితే, ఆయన ఎన్ని వేషాలు వేసినా.. విభజన కారణంగా ఏపీకి జరగాల్సిన నష్టంలో ఒక్క శాతాన్ని కూడా తగ్గించలేకపోయారు.

ఇవి కూడా చదవండి:గ్యాంగ్‌లీడర్ రీమేక్ కి రెడీయా?

ఇక ఇప్పుడు విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ చేసిన హామీపై కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎంపీ శివప్రసాద్ అంబేడ్కర్ వేషం వేసి.. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ యాసలో మాట్లాడిన ఆయన.. మోడీ సర్కారుపై సున్నితంగా చురకలు వేశారు. "అరేరే.. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతుందా? నేను రాసిన రాజ్యాంగానికే విలువ లేదా? ఏపీ అభివృద్ధికి రాత్రింబవళ్లు కష్టపడుతున్న చంద్రబాబుకు ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయా? ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించలేదా? ఐదేళ్లు కాదు పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా అంటూ బీజేపీ నేత వెంకయ్యనాయుడు చెప్పలేదా?' అంటూ ప్రశ్నలు వేస్తూ డాక్టర్ శివప్రసాద్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. మరి బాబు గారు ఎలాంటి విమర్శలు చేయకుండా కేంద్రంతో ఫ్రెండ్ షిప్ ద్వారానే డిమాండ్లు సాధించుకుందామని , సహనంతో ప్రజల విశ్వాసం రెట్టింపు చేసుకుందామని చెబుతుంటే, ఈ వేషాలు ఏమిటి అనే మాట వినిపిస్తోంది. అది సరే ఎన్.డి.ఏ కు చికాకు కలిగించే ఇలాంటి ఘటనలపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందోనని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:మహేష్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?

ఇవి కూడా చదవండి:రవిశంకర్ పై ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

English summary

Chittoor MP Siva Prasad was known for his different types of Getup's and protest . Recently he looked as Dr B.R.Ambedkar at Parliament and Demanded BJP government to give Special Status to Andhra Pradesh.