బాక్సైట్ పై  చర్చకు సై అంటున్న టిడిపి 

TDP Says Ready To DIscuss On Bauxite Issue

05:57 PM ON 19th December, 2015 By Mirchi Vilas

TDP Says Ready To DIscuss On Bauxite Issue

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎదురుదాడి చేస్తూ, విపక్షాన్ని దెబ్బతీస్తున్న టిడిపి ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది. వైసిపి ప్రస్తావించే అంశాలనే చర్చకు చేపట్టడం ద్వారా తన వ్యూహం అమలు చేయాలని టిడిపి పావులు కదుపుతోంది.

సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడడంతో ఆరోజు బాక్సైట్ మీద చర్చ చేపట్టాలని టిడిపి ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం సాయంత్రం అందుబాటులో వున్న మంత్రులు ,చీఫ్ విప్ , విప్ లతో సిఎమ్ చంద్రబాబు సమావేశమయ్యారు.

సోమవారం అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించిన చంద్రబాబు ప్రతిపక్షం సరిగ్గా పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు. విపక్షం కన్నా ముందే బాక్సైట్ పై చర్చ చేపట్టాలని ఆయన దిశా నిర్దేశం చేసారు.

ఇప్పటికే రోజా సస్పెన్షన్ తో ఆందోళన చేస్తున్న వైసిపి ఈ సస్పెన్షన్ ఎత్తివేసే వరకు ఆందోళన చేస్తామని చెప్పిన సంగతి తెల్సిందే. మరి ప్రభుత్వం చేపట్టే బాక్సైట్ చర్చ నేపధ్యంలో వైసిపి వైఖరి ఎలా వుంటుందో చూడాలి.

English summary

Andhra Pradesh TDP leaders says that TDP was ready to discuss about Bauxit issue on Monday Assemble Session