ఆ ఇష్యూలో కాంగ్రెస్ తో జతకడుతున్న టిడిపి

TDP To Join Hands With Congress On Special Status To AP

04:14 PM ON 11th May, 2016 By Mirchi Vilas

TDP To Join Hands With Congress On Special Status To AP

రాజకీయంగా ఎలాంటి వైరం వున్నా కొన్ని విషయాల్లో కలసిపోతారు. మరికొన్ని విషయాల్లో మంకు పట్టు పడతారు. కీలమైన ఎపికి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ తో వైసిపి , టిడిపి జతకడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఏపీ ప్రత్యేక హోదా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని వైసిపి ఇప్పటికే నిర్ణయించగా , తాజాగా టీడీపీ కూడా అదే బాట పట్టిందని వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎంపీలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈమేరకు ఆదేశాలు ఇచ్చేసారట. పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీచేశారని అంటున్నారు.

ఇవి కుడా చదవండి:అది చేస్తూ దొరికేసిన ఎయిర్ హోస్టెస్

బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని కేంద్రమంత్రి సుజనా చౌదరిని కూడా బాబు ఆదేశించినట్లు ఓ టీడీపీ ఎంపీ తెలియజేశారు. ప్రత్యేక హోదా అంశంపై వెనక్కి తగ్గేది లేదని, పైగా కేవీపీ బిల్లుకు మద్దతిస్తే టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో మార్పులు చేసే ఆలోచన కేంద్రానికి లేదని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా లేఖ రాసిన తర్వాతే టీడీపీ వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలిసింది. అలాగే, ప్రత్యేక హోదాపై బీజేపీ వైఖరిలో మార్పు తెచ్చేందుకే ఈ బిల్లుకు మద్దతిస్తున్నట్టు బీజేపీకి కూడా వెల్లడించాయి.

కాగా కేవీపీ ప్రవేశపెట్టిన ప్రత్యేక బిల్లుపై 13వ తేదీన చర్చ జరిగినప్పుడు. ఇంతవరకు రాష్ట్రానికి ఆయా శాఖలవారీగా విడుదల చేసిన నిధుల జాబితాను సభ ముందు పెట్టాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. కేంద్రం అందజేసిన నిధుల పై గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజమహేంద్రవరం సభలో చెప్పిన లెక్కలతో పాటు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను కూడా వివరించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

ఇవి కుడా చదవండి:శృంగారానికి బానిసైన శ్రీనివాస్‌

English summary

Telugu Desam Party was going to join hands with Congress Party for Special Status For Andhra Pradesh. Congress Party Senior Leader KVP was passed a private bill in Parliament for demanding Special Status for Andhra Pradesh and now TDP and Ysrcp to Support that bill in Parliament.