కాంగ్రెస్ పంచాంగ శ్రవణంలో టిడిపి అలజడి

TDP Will Face Problems

01:06 PM ON 9th April, 2016 By Mirchi Vilas

TDP Will Face Problems

ఉగాది సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసుకోవడం గడిచిన కొన్నేళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. అందుకే ఎవరి శ్రవణం వారిదన్నట్లుగా ఈ కార్యక్రమం నడుస్తోంది. ఎందుకంటే, ఎవరు ఏర్పాటు చేసుకున్న శ్రవణం వారికి కాలం కలిసి వస్తుందన్న మాట చెప్పటం కనిపిస్తుంది. మిగిలిన పార్టీల సంగతి పక్కన పెడితే.. విభజన కారణంగా పాతాళంలోకి కూరుకుపోయిన ఏపీ కాంగ్రెస్ పార్టీ గురించి ఉగాది శ్రవణంలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. విభజన జరిగి.. కొత్త ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు పూర్తి అయినా.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఏపీ ప్రజల ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన ఉగాది శ్రవణంలో.. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో కాస్త మెరుగుపడే అవకాశం ఉందని తేలింది. అయితే.. ఈ అక్టోబరు.. నవంబరులలో మాత్రం చంద్రబాబు సర్కారులో ‘అలజడి’ చోటు చేసుకునే వీలుందని పంచాంగ శ్రవణంలో చెప్పుకొచ్చారు. అయితే టిడిపిలో ఎలాంటి అలజడి వస్తుందో చూడాలి మరి. ఇక అమరావతి నిర్మాణం ఆశించినంతగా జరగదన్న మాట పంచాంగ శ్రవణం తేల్చింది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో ఏపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న మాటను చెప్పటంతో పాటు మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అధికారపార్టీపై వచ్చిన వ్యతిరేకతను ప్రతి పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునేలోగా, రాష్ట్ర ప్రభుత్వం ఆ తప్పుల్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తానికి రానున్న ఏడాది కాలంలో ఏపీలో కాంగ్రెస్ ఏమీ చేయలేదన్న విషయం తేటతెల్లం అయింది.

English summary

Telugu Desham Party will face problems at the end of this year. This was said in Panchanga Sravanam which was said On the Festival of "Ugadi".