జుట్టు వేగంగా పెరగటానికి  టీ ట్రీ ఆయిల్

Tea Tree Oil for Hair Growth

09:26 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Tea Tree Oil for Hair Growth

ప్రతి మహిళ అందమైన మరియు ఒత్తైన జుట్టు కావాలని కలలు కంటుంది. అయితే జుట్టు సహజంగా పెరగటానికి టీ ట్రీ ఆయిల్ లో ఉండే లక్షణాలు సహాయపడతాయి. టీ ట్రీ ఆయిల్ ని జుట్టు నష్టం, చుండ్రు వంటి సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. ఈ ఆయిల్ జుట్టు మరియు తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు టీ ట్రీ ఆయిల్ జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

1/11 Pages

1. టీ ట్రీ మరియు ఆలివ్ ఆయిల్

ఆలివ్ నూనెతో టీ ట్రీ ఆయిల్ కలిసినప్పుడు జుట్టు పెరుగుదలలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. టీ ట్రీ మరియు ఆలివ్ ఆయిల్ లో ఉండే బ్యాక్టిరియాల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టు మీద బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను నాశనం చేస్తుంది. అంతేకాక జుట్టు నష్టానికి ప్రధాన కారణం అయిన డిటిహెచ్ హార్మోన్ ని చెక్ చేస్తుంది.

కావలసినవి

  • టీ ట్రీ ఆయిల్ - 7 నుంచి 10 చుక్కలు
  • వెచ్చని ఆలివ్ నూనె - 3 టేబుల్ స్పూన్లు

పద్దతి

* ఒక బౌల్ లో గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ తీసుకోని దానిలో టీ ట్రీ ఆయిల్ ని కలపాలి.
* ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాయాలి.
* తలకు  షవర్ క్యాప్ పెట్టి రాత్రంతా అలా వదిలేయాలి.
* మరుసటి రోజు ఉదయం సాధారణ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి.
* ఈ పద్దతి జుట్టు పెరుగుదలకు మరియు చుండ్రు నివారణకు బాగా సహాయపడుతుంది.

English summary

We have listed about tips for rapid hair growth. Tea tree oil, which is prepared from Melaleuca Alternifolia leaves, is used to treat various scalp and hair-related problems, such as hair loss, dandruff, scalp dermatitis, etc.