హోంవర్క్‌ చేయనందుకు నగ్నంగా నిలబెట్టారు

Teacher Removes Clothes Of Students For Not Doing Homework

12:07 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Teacher Removes Clothes Of Students For Not Doing Homework

ప్రస్తుత విద్యా విధానం వెర్రితలలు వేస్తోంది. కాల మహిమో ఏమో గానీ, విద్య నేర్పాల్సిన ఉపాధ్యాయులే వికృతంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అక్కడక్కడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విద్యార్థులు చేసే చిన్నచిన్న పొరపాట్లకు సైతం పెద్ద శిక్షలే వేస్తున్నారు. నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తున్నారు. మరీ చిన్న పిల్లలైతే ఫర్వాలేదు గానీ ఓ వయస్సు వచ్చాక నగ్నంగా నిలబెడితే వాళ్ళ పరిస్థితి ఏమిటో చెప్పనలవి కాదు.ముంబయిలో ఓ స్కూల్లో విధులు నిర్వరిస్తున్న టీచర్ సరిగ్గా అలాంటి పనే చేసింది. వివరాల్లోకి వెళితే, 10 నుంచి 12 సంవత్సరాల వయసున్న ఇద్దరు విద్యార్థులు హోం వర్క్ చేయలేదన్న నెపంతో ఆ టీచర్ అరుదైన శిక్ష వేసింది. హోం వర్క్ చేయలేదన్న కారణంగా ఆ ఇద్దరి విద్యార్థులను క్లాస్ రూమ్ ఎదుట ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసి, నగ్నంగా నిలబెట్టింది. ఆ క్లాస్ రూమ్ పక్కగా వెళుతున్న స్కూల్ సిబ్బందిని చూసి ఆ ఇద్దరు విద్యార్థులు పాపం ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్నారు. ముంబయిలోని శ్రీ ట్యుటోరియల్స్ అనే విద్యాలయంలో ఈ ఘటన నేపధ్యంలో టీచర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆమెపై సెక్షన్ 75, 82 జువైనల్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ సదరు టీచరమ్మ ఆ స్కూల్ యజమాని కి సోదరే కావడం కొసమెరుపు.

English summary

A Teacher in mumbai punishes two students for not doing home work.Teacher take of the clothes of the two children as punishment.One of the person posted the whole thing in online and Mumbai Police reacted and filed case on the teacher of that school.