విద్యార్ధులను కొట్టుకోమన్న టీచర్

Teacher Suspended for Ordering Students to Slap Themselves 100 Times

06:18 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Teacher Suspended for Ordering Students to Slap Themselves 100 Times

సాధారణంగా విద్యార్ధులను తీవ్రంగా కొట్టినందుకు టీచర్లను సస్పెండ్ చెయ్యడం చూస్తుంటాము. కాని విద్యార్ధులను తమకు తాముగా కొట్టుకోమన్నందుకు టీచర్ ను సస్పెండ్ చేసిన వింత ఘటన చైనా లో చోటు చేసుకుంది.

చైనాలోని హన్యు ప్రైమరీ స్కూల్ లోని ఒక టీచరమ్మ 6 నుండి 7 ఏళ్ళ వయసు గల చిన్న చిన్న పిల్లలను తమకు తాముగా 100 సార్లు శబ్దం వచ్చేలా మరీ తమను తామే కొట్టుకోమని చెప్పడంతో ఆ చిన్న పిల్లలను ఆదేశించడంతో ఆ పసి వాళ్ళు కొట్టుకున్నారు. ఐతే అలా కొట్టుకోవడం వల్ల ఎరుపెక్కిన పిల్లల లేత ముఖాలను చూసిన తల్లిదండ్రులు ఇది ఏంటని ఆరా తీయగా అసలు విషయం తెలియడంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు స్కూల్ లో ఆందోళనకు దిగారు . ఆశలు ఆ టీచర్ ఇలా చెయ్యడం ఏంటని స్కూల్ ప్రిన్సిపాల్ ను నిలదీశారు. చినారులున్న క్లాసుకు వెళ్ళిన టీచర్ కు అంతా గందరగోళంగా ఉండడంతో విసుగేత్తుపోయిన ఆమె పిల్లలను తమకు తాముగా కొట్టుకోవాలని అన్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు.

ఇలా చేసిన టీచర్ ను విధుల నుండి తొలగించామని,అంతేకాక పిల్లలతో పిచ్చిగా ప్రవర్తించినందుకు ఆమె పై చైల్డ్ అబ్యూస్ కేసును కుడా నమోదు చేసినట్టు స్కూల్ ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు.

English summary

A Chinese teacher asked students aged six or seven to slap themselves 100 times in face hard enough to make a hearable sound, forcing school authorities to expel her.