12 మంది బాలికలను రేప్ చేసిన టీచర్స్.. ఆపై..

Teachers raped 12 minor girls

10:54 AM ON 5th November, 2016 By Mirchi Vilas

Teachers raped 12 minor girls

మహిళలపై జరుగుతున్న దాడుల వెనుక ఆకతాయిలే కాదు, పెద్ద తలకాయలున్నాయని అంటుంటారు. కొన్ని ఘటనలు కూడా అందుకు కనిపిస్తూనే వున్నాయి. ఇక గురు బ్రహ్మ అనే పదానికి అర్ధాన్ని చెరిపేస్తూ, విద్యార్థినులపై లైంగిక దాడులకు దిగిన ఉపాధ్యాయుల నీచత్వం వెలుగుచూసింది. అవును బాలికలకు పాఠాలు చెప్పాల్సిన గురువులే దారితప్పారు. ఓ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సహా ఉపాధ్యాయులు 12 మంది బాలికలపై అత్యాచారాలకు తెగబడిన దారుణ ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సంచలనం రేపింది. అత్యాచారానికి గురైన బాలికల్లో ముగ్గురు బాలికలు గర్భవతులని తేలింది. వివరాల్లోకి వెళ్తే...

1/6 Pages

బుల్దానా జిల్లా ఖామ్ గామ్ లోని నినాధి కొక్రే గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 12 నుంచి 14 ఏళ్ల లోపు గిరిజన బాలికలపై ఉపాధ్యాయులే అత్యాచారాలకు పాల్పడ్డారని అంటున్నారు. ముగ్గురు బాలికలు గర్భం దాల్చడంతో బాలికలపై కొనసాగిన అత్యాచారాల పర్వం వెలుగుచూసింది.

English summary

Teachers raped 12 minor girls