టీ20 వరల్డ్ కప్ టీమ్ ఇదే

Team India for World T20

06:42 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Team India for World T20

త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌, ఆసియా కప్‌లో బరిలోకి దిగే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మెగా టోర్నీల్లో టీమ్‌ ఇండియాకి ధోనీనే నాయకత్వం వహించనున్నాడు. సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని సెలక్టర్లు 15 మంది జట్టు సభ్యుల పేర్లను వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనతో టీమ్‌ ఇండియాలోకి పునరాగమనం చేసిన సీనియర్‌ ఆటగాళ్లు యువరాజ్‌ సింగ్‌, ఆశిష్‌ నెహ్రాకి టీమ్ లో చోటిచ్చిన సెలక్టర్లు సురేశ్‌ రైనా, హర్భజన్‌సింగ్‌లకు అవకాశమిస్తూ మరోసారి అనుభజ్ఞులకు పెద్దపీట వేశారు. గాయం నుంచి కోలుకున్న రహానెకు జట్టులో స్థానం దక్కింది. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో అజేయ శతకంతో చివరి వన్డేలో భారత్‌ను గెలిపించి అందరి దృష్టిని ఆకర్షించిన మనీశ్‌ పాండేకు చుక్కెదురైంది. ఆసీస్‌ పర్యటనలో బౌలింగ్‌తో కంగారూల బ్యాట్స్‌మెన్లను బెంబెలెత్తించిన యువ పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్డిక్‌ పాండ్యపై సెలక్టర్లు నమ్మకముంచారు. స్పిన్నర్ల కోటాలో సీనియర్లు అశ్విన్‌, జడేజాతో పాటు పవన్‌నేగికి తొలిసారి అవకాశమిచ్చారు. ప్రపంచకప్‌-2015లో బౌలింగ్‌తో అదరగొట్టి తర్వాత గాయాల కారణంగా మైదానంలో కనుమరుగైన పేసర్‌ మహ్మద్‌ షమీని అనూహ్యంగా సెలక్టర్లు తుదిజట్టులో చేర్చి ఆశ్చర్యపరిచారు. భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లకు ఈసారి చోటు దక్కలేదు.

టీమిండియా జట్టు వివరాలను ఓ సారి చూద్దాం..

ఎంఎస్ ధోనీ (కెప్టెన్. & వికెట్కీపర్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అశ్విన్, జస్ప్రిట్ బూమ్రః , ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్, మహ్మద్ షమీ, పవన్ నెగి

ఐసిసి టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

టీ20 ఆసియా కప్ షెడ్యూల్

English summary

Today Indian cricket team were selected for upcoming Asia Cup And World T20 Tournaments.The full squad was Mahendra Singh Dhoni (c) , Rohit Sharma, Shikar Dhawan, Virat Kohli, Suresh Raina, Yuvraj Singh, Ajinkya Rahane, Ravindra Jadeja , Hardik Pandya, R Ashwin, Harbhajan Singh, Jasprit Bhumrah, Ashish Nehra, Pawan Negi, Mohd Shami