లగడపాటిని మించిపోయారు..

Tear Gas In Kosovo Parliament

05:12 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Tear Gas In Kosovo Parliament

పార్లమెంట్‌లో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ఘటనను తలపించే సీన్ కోసావో పార్లమెంట్ లో చోటుచేసుకుంది. పెప్పర్‌స్ప్రే, టియర్‌గ్యాస్‌తో పార్లమెంట్‌ను ముంచెత్తారు ఆ దేశ ప్రతిపక్ష ఎంపీలు. మాట్లాడితే చాలు టియర్ గ్యాస్, పెస్పర్ స్ప్రే వెదజల్లడం వారికి నిత్యకృత్యమైపోయింది. గత కొద్ది నెలలుగా కొసోవో పార్లమెంట్‌ సమావేశమైన ప్రతిసారీ పెప్పర్‌స్ప్రే చేసిన ఎంపీలు తాజాగా సోమవారం కూడా అదే పనిచేశారు. కాకపోతే ఈసారి టియర్‌గ్యాస్‌ను కూడా వెదజల్లారు. ఆ మంటకు మిగతా ఎంపీలు ఊపిరి అందక విలవిల్లాడిపోయారు. కొందరు ఆస్పత్రి పాలయ్యారు. ప్రతిపక్ష ఎంపీల నిరసనకు కారణమేమిటంటే... 2008లో సెర్బియా నుంచి విడిపోయి కొసావో స్వతంత్ర దేశంగా అవతరించింది. రెండు దేశాల సరిహద్దులో ఉన్న కొన్ని ప్రాంతాలపై సెర్బియాకు ఎక్కువ అధికారాలు ఇస్తూ కొసోవో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైనే ప్రతిపక్ష నేతలు నిప్పులు చిమ్ముతున్నారు. పెప్పర్‌స్ప్రే, టియర్‌గ్యాస్ అనేవి తమ నిరసనల్లో భాగమని వారు వాదిస్తున్నారు

English summary

Tear Gas has blown by one of MP in Kosovo parliament. Soo many MP's in the parliament were gone away by not getting of breath