ఆంజనేయుని కంట నీరు... ఆందోళనలో భక్తులు(వీడియో)

Tears coming from Anjaneyaswamy statue in Khammam

12:14 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Tears coming from Anjaneyaswamy statue in Khammam

ఆ మధ్య వినాయకుడు పాలు తాగాడు వంటి ఘటనలు చూసాం.. కానీ ఇప్పుడు ఖమ్మం జిల్లాలోని వైరా మండలం బ్రాహ్మణపల్లి అగ్రహారంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. అగ్రహారంలో ఉన్న అభయాంజనేయస్వామి కంట్లో నుంచి ధార ప్రవహిస్తోంది. ఆలయ పాలకవర్గం గడువు ముగియడంతో అర్చకులు నిన్న గుడిని మూసివేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిన్న ఆలయ శుద్ధికై అర్చకులు ఆలయాన్ని తెరువగా స్వామి కంటి నుంచి నీటి ధార కారుతూ కనిపించింది. ఈ విషయాన్ని ఆలయ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన గ్రామస్థులు వింతను చూసేందుకు తరలివస్తున్నారు. స్వామి కంట నుంచి నీరు రావడం పై భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

ఆ నోటా ఈ నోటా ఇది చుట్టు పక్కల గ్రామాలకు పాకింది. దీంతో పలువురు భక్తులు అక్కడికి చేరారు.

English summary

Tears coming from Anjaneyaswamy statue in Khammam