అయ్యో, ఈ బామ్మకు ఏమైంది.. తెలిస్తే కన్నీరు పెడతారు

Tears news of old woman

12:18 PM ON 19th October, 2016 By Mirchi Vilas

Tears news of old woman

నాలుగు రోజులపాటు ఆ పెద్దావిడి పడిన నరకయాతన గురించి వింటే ఎవరికయినా కన్నీళ్లు రావడం ఖాయం. బ్రిటన్ కు చెందిన 86 ఏళ్ల డొరీన్ మాన్ తరచూ ఎస్సెక్స్ లోని టొమాస్సీ కేఫ్ రెస్టారెంట్ లో మధ్యాహ్నం భోజనం చేస్తుంటుంది. అయితే రెండు రోజులుగా రెస్టారెంట్ కు రాకపోవడంతో అనుమానం వచ్చిన రెస్టారెంట్ లోని వెయిట్రెస్ సోనియా కాంగ్రెవ్(39) పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే వారు ఆమె చెప్పిన అడ్రస్ కు వెళ్లారు. అక్కడి బాత్రూంలోని దృశ్యాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు. డొరీన్ అప్పటికి నాలుగు రోజులుగా బాత్ టబ్ లో ఇరుక్కుపోయారు.

సాయం చేసేవారు లేక, తిండీ తిప్పలు లేక అలాగే అందులో ఉండిపోయారు. పోలీసులు వెంటనే ఆమెను బయటకు తీశారు. వెయిట్రెస్ సోనియాకు కనుక అనుమానం రాకుంటే తన ప్రాణాలు పోయి ఉండేవని డొరీన్ కన్నీటి పర్యంతమయ్యారు.

English summary

Tears news of old woman