బండరాళ్లతో కొట్టి చంపేశారు

Techie murdered in Hyderabad

01:17 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Techie murdered in Hyderabad

నేర ప్రపంచం...అవును ఈ ప్రపంచంలో నేరాలు హెచ్చిపోతున్నాయి. అందునా పెద్ద కారణం లేకుండానే మర్డర్ లు చేసేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. రెండురోజుల కిందట మిస్సైన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ హష్మి దారుణహత్యకు గురయ్యాడు. అతడి మృతదేహాన్ని లింగంపల్లి రైల్వేట్రాక్ వద్ద స్థానికులు కనుగొని పోలీసులకు వర్తమానం అందించారు. హష్మి వద్దనున్న బంగారు గొలుసు, సెల్‌ఫోన్ కోసమే దుండగులు బండరాయితో మోడీ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మి, నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం సమీపంలో పేరెంట్స్‌తో కలిసి నివాసం వుంటున్నాడు. ఈ నెల 23న డ్యూటీకి వెళ్లిన హష్మి తిరిగి రాలేదు. ఆ తర్వాత అతడి సెల్ స్విచ్ఛాఫ్ కావడంతో పేరెంట్స్‌కు అనుమానం వచ్చి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఓ వైపు దర్యాప్తు జరుగుతుండగానే మరోవైపు లింగంపల్లి రైల్వేట్రాక్ వద్ద హష్మి డెడ్‌బాడీ బుధవారం లభ్యమైంది. దుండగులు బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. సెల్‌ఫోన్, నగదు, బంగారు గొలుసు కోసమే హత్య చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Techie murdered in Hyderabad