ఫేస్ బుక్ సాక్షిగా...ఆత్మహత్య యత్నం...

Techie Posts Photos Of Suicide Attempt On Facebook

11:09 AM ON 16th June, 2016 By Mirchi Vilas

Techie Posts Photos Of Suicide Attempt On Facebook

ఇదో రకం ఉన్మాదం...మరీ ఎటాచ్ మెంట్ ఎక్కువగా వుంటే అదో రకమైన డిప్రెషన్ లోకి పోతాం. సరగ్గా అదే జరిగింది ఇక్కడ. అదికూడా ఫేస్ బుక్ సాక్షిగా...కన్న తల్లి చనిపోవడంతో డిప్రెషన్ కు లోనైన ఓ టెక్కీ, ఫేస్ బుక్ వేదికగా ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడి ఫ్రెండ్స్ పోలీసులను అలర్ట్ చేయడంతో చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఇంతకీ ఈ టెక్కీకి ఏం జరిగింది? కారణమేంటి? డీటేల్స్ లోకి వెళ్తే.. గుర్గావ్ కు చెందిన 30 ఏళ్ల వ రుణ్ మాలిక్ అనే వ్యక్తి.. ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా ప ని చేస్తున్నాడు. పేరెంట్స్ తో కలిసి ఓ ఫ్లాట్ లో ఉంటున్నాడు. ఇదిలావుండగా వరుణ్ కిడ్నీ పాడైపోవడంతో తల్లి అతడికి కిడ్నీ ఇచ్చింది. ఐతే ఆమె కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో మరణించడంతో వ రుణ్ పూర్తిగా డిప్రెష న్ లోకి వెళ్లిపోయాడు.

ఇదే విషయం ఫేస్ బుక్ ద్వారా తన క్లోజ్ ఫ్రెండ్స్ తో చెప్పి సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖ రాసుకొచ్చాడు. మణిక ట్టును కోసుకొని దానిని కూడా తన ల్యాప్ టాప్ వెబ్ క్యామ్ తో తన ఫ్రెండ్స్ కి చూపించాడు. వెంటనే స్పందించిన అతడి ఫ్రెండ్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు గుర్గావ్ లో ఉండేవాళ్లు వరుణ్ ఎక్కడుంటాడో తెలిసినవాళ్లు వెంటనే అతన్ని రక్షించాలని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. చివరకు పోలీసులు వరుణ్ ఇంటికి వెళ్లేసరికి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. రక్తం అధికంగా పోవడంతో అతడ్ని దగ్గర్లో ఓ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడ గానే ఉందని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి పరిణామాలు మంచిది కాదని నెటిజన్లు అంటున్నారు.

1/5 Pages

English summary

A techie in Gurgaon was attempted to suicide by cutting his hand. He posted a video of his suicide attempt in his facebook account and his FB friends contacted police and police came to his house and taken him to near by hospital. He did this thing because of his mother was died recently with some health problem and he got depressed with his mom's death and he attempted to suicide.