చెన్నైకు టెక్నాలజీ సంస్థల సాయం

technology start ups helps to Chennai

12:44 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

technology start ups helps to Chennai

వరదలలో చిక్కుకుని చరిత్రలో ఎన్నడూ లేని విలయాన్ని చవిచూస్తున్న చైన్నై ప్రజలను టెక్నాలజీ కంపెనీ వినూత్నమైన రీతిలో ఆదుకుంటున్నాయి. ఐటి రంగంలో ముందుకు దూసుకుపోతున్న చెన్నైలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎన్నో సంస్థలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అనుకోని రీతిలో వచ్చిన చెన్నై ముప్పునుండి బాధితులకు ఊరట కలిగించేందుకు ఇప్పుడు అవే ఐటి కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఎన్నో స్టార్టప్‌ కంపెనీలు ఇప్పుడు చెన్నైకు ఆపన్న సమయంలో సాయమందించేందుకు ముందుకు కదులుతున్నాయి.

ఆన్‌లైన్‌ పేమెంట్లలో అగ్రస్థానంలో ఉన్న పేటిఎం కంపెనీ చెన్నైలోని వరద బాధితులు 18001030033 అనే టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేస్తే 30రూపాయల ఫ్రీ టాక్‌టైమ్‌ వచ్చేలా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డరింగ్‌ సంస్థ జమాటో కూడా వరద భాదితులకు తక్కువ మొత్తానికే ఆహారాన్ని సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేకాకుండా స్వచ్చంద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న జమాటో ఎవరైనా తమ ప్లాట్‌ఫాం ద్వారా ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే, దానిని వరద బాధితులకు అందేలా కూడా ఏర్పాట్లు చేసింది.

టాక్సీ సర్వీస్‌ల సంస్థ ఓలా సైతం వరద బాధితులను ఆదుకునేందుకు నడుం బిగించింది. కొన్ని సురక్షిత ప్రాంతాలను సిద్ధం చేసిన ఓలా వరద బాధితులను అక్కడికి తరలించి వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తోంది. ఓలా ప్రత్యర్ధి అయిన ఉబెర్‌ సైతం వరద బాధితులకు ఉచితంగా రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఆన్‌లైన్‌ గ్రోసరీ సరుకుల కంపెనీ అయిన బిగ్‌బాస్కెట్‌ ద్వారా వరదబాధితులకు రోజువారీ ఉపయోగించే కాయగూరలను, పప్పులను అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. వైద్య సేవలను అందించే ప్రాక్టో అనే స్టార్టప్‌ చెన్నై సమీపంలోని వైద్యులను వరద బాధితులకు ఉచిత వైద్య సహాయం అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. వసతి సదుపాయాలను అందించే స్టైల్‌జిల్లా స్టార్టప్‌ ప్లాట్‌ఫాం ద్వారా ఎవరైనా వరదబాధితులకు ఉచితంగా వసతి అందించేందుకు తన యాప్‌కు కొత్త ఫీచర్‌ను జోడించింది.

టెక్నాలజీ సౌలభ్యంతో మన జీవన శైలిని మరింత ప్రభావితం చేసిన ఈ టెక్నాలజీ స్టార్టప్‌లు చెన్నై వాసులకు ఇలాంటి విపత్కర పరిస్థితులలో చేయూతనందివ్వడం ద్వారా మరింతగా ప్రజలలో అభిమానాన్ని చూరగొంటున్నాయి.

English summary

Technology companies are giving their hand to help the flood victims in chennai. Paym offers a free talktime of 30 rupees by giving a missed call to a toll free number 18001030033. The Companies like Ola,big busket,style zilla,procto were also helping to flood victims in their ways in chennai