నిజామాబాద్‌ లో దారుణం మైనర్లయిన పాపానికే ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

Teenage Couple Suicides In Nizamabad

12:00 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Teenage Couple Suicides In Nizamabad

దేవదాసు కాలం నుండి వస్తున్న ఆనవాయితి ఇదే. ఒక అబ్బాయి-అమ్మాయి ప్రేమించుకుంటారు, పెళ్ళి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పించాలనుకుంటారు కానీ అబ్బాయి తరపున వాళ్లో, అమ్మాయి తరపున వాళ్లో అభ్యంతరం చెప్తారు. ఇద్దరిది ఒకటే కులమైతే కొంతమంది ఓకే చెప్తారు. మరి కొంతమంది ఆస్తులు కోసం చూస్తారు. ఆస్తులు ఉంటే ఉద్యోగం చూస్తారు ఇలా ఒక ప్రేమ వివాహం చేసుకోవాలంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు. దీనితో ఆ ప్రేమ జంట చేసేది లేక ఇంట్లో నుండి లేచిపోవడమో లేక ఆత్మహత్య చేసుకోవడమో చేస్తుంటారు.

తాజాగా ఇటువంటి సంఘటనే నిజామాబాద్‌ జిల్లా లోని డిచ్‌పల్లిలో జరిగింది. అయితే ఈసారి పెద్దలు అభ్యతరం చెప్పలేదు అయినా ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకో తెలుసా ? ఆ విషయం తెలుసుకోవాలంటే అసలు మ్యాటర్‌ లోకి వెళ్లాల్సిందే. అసలు విషయంలోకి వస్తే సిరికొండి మండలం రావుట్ల గ్రామానికి చెందిన సాయిరామ్‌ (19),డిచ్‌పల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన అజ్జం శిరీష (17) గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అంతేకాదు వరుసకి వీరిద్దరూ బావమరదళ్లు కూడా. అయితే శిరీష కి తన తల్లిదండ్రులు పెళ్ళి చెయ్యడానికి చూస్తుండడంతో సాయిరామ్‌ శిరీష తల్లిదండ్రులకి మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలియజేసాడు. దీనితో శిరీష వయస్సు 17 సంవత్సరాలు కావడంతో మేజర్‌ అవ్వడానికి ఒక సంవత్సరం పడుతుంది కాబట్టి, ఒక సంవత్సరం అయ్యాక పెళ్ళి చేస్తామని ఇంట్లో చెప్పారు. కానీ వీరిద్దరూ ఒక సంవత్సరం విడిచి ఉండలేక, కలిసి చావడమే దారని ఒకే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో సాయిరామ్‌ శిరీష కు తాడుతో ఉరివేసి ఆ తరువాత తాను కూడా ఉరివేసుకుని చనిపోయాడు.

ఆత్మహత్య చేసుకునే ముందు రోజు అనగా సోమవారం రాత్రే శిరీషని బైక్‌పై ఎక్కించుకుని కొత్తపేట నుండి తీసుకు వచ్చేశాడు. ఆ తరువాత నర్సింగ్‌పూర్‌ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర బైక్‌ని వదిలేసి అక్కడ నుండి కమలాపూర్‌ శ్మశాన వాటికకు నడుచుకుంటూ వెళ్లి మంగళవారం తెల్లవారు జామున ఉరి వేసుకుని చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నరేందర్‌ రెడ్డి లు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్‌ మార్టం నిమిత్తం మృతదేహాలను హాస్పటల్‌కి తరలించారు. అజ్జం శిరీష డిచ్‌పల్లి లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీఈసీ రెండవ సంవత్సరం చదవుతుంది. పరీక్షల కోసమని కాలేజ్‌కి వెళ్లి హాల్‌టికెట్‌ తీసుకున్న 24 గంటల్లో శిరీష తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయింది. శిరీష తల్లిదండ్రులకి శిరీష ఒక్కగానొక్క కూతురు. ఆమె లేదని తెలిసిన తల్లితండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

English summary

A teenage couple belongs to Ditchpalli in Nizamabad District in Telangana State commits suicide in Burial ground. According to the source A boy named Sairam of 19 years age and a girl Sirisha of 17 years was loved each other.They said those love matter to their parents and the parents said that they will do marriage in one year because of the girl was minor.Due to that they two committed suicide at the early morning in Burial Ground.