పెళ్ళి ప్రపోజల్ కాదన్న టీచర్ కి చిత్రహింసలు .. ఆపై సజీవ దహనం

Teenage girl burned alive in Pakistan

11:02 AM ON 2nd June, 2016 By Mirchi Vilas

Teenage girl burned alive in Pakistan

దేశం ఏదైనా మహిళలపై జరిగే దారుణాలకు అంతులేకుండా పోయింది. అదే కోవలో ఓ దారుణం జరిగిపోయింది. ఓ టీచర్ పెళ్ళి ప్రపోజల్ను నిరాకరించిందని ఆమెను చిత్రహింసలకు గురిచేసి చివరికి సజీవదహనం చేశారు. రెండురోజులపాటు మృత్యవుతో పోరాడిన ఆమె చివరికి మరణించింది. పాకిస్థాన్లో చోటు చేసుకున్న ఈ దారుణమైన ఘటన కు సంబంధించిన వివరాలిలా వున్నాయి.

పాక్ రాజధాని ఇస్లామాబ్కు సమీపంలోని ముర్రీ ప్రాంతంలో వుంటున్న మరియా సదాఖత్(19) అనే యువతి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆ స్కూలు ప్రిన్సిపాల్ తన కొడుకును వివాహం చేసుకోవాలని ఆమెను కోరాడు. అయితే.. అతని వయసు తనకంటే రెట్టింపు వుండడమే కాకుండా అతడు ఇదివరకే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడన్న కారణంతో సదాఖత్ పెళ్లికి నిరాకరించింది. అంతేకాదు.. టీచర్ జాబ్ కూడా వదిలేసింది. దీంతో.. ఆమెపై పగ పెంచుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ ఆమెని చంపేయాలని ప్లాన్ వేశాడు. ఇందుకు కొందరు వ్యక్తుల సహకారం తీసుకున్నాడు.

ఇటీవల నలుగురు వ్యక్తులతో కలిసి సదాఖత్పై ఆ ప్రిన్సిపాల్ దాడికి పాల్పడ్డారు. తన కొడుకును పెళ్ళి చేసుకోవాలని.. లేకపోతే చంపేస్తామని ప్రిన్సిపాల్ బెదిరించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో సజీవ దహనానికి యత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, రెండు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. చనిపోయేముందు ఈ ఘటనపై ఆమె ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులలో ఒకరిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇది కూడా చూడండి :చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన అనుష్క!

ఇది కూడా చూడండి :నాని కోసం క్యూలో మంజుల

ఇది కూడా చూడండి :వారం రోజుల్లో కిడ్నీ స్టోన్స్ కరిగించే రెసిపీ

English summary

Teenage girl burned alive in Pakistan.